Homeఆంధ్రప్రదేశ్‌YSR Rythu Bharosa: రైతులకు భరోసా రూ.ఐదున్నరవేలేనా జగన్ సార్?

YSR Rythu Bharosa: రైతులకు భరోసా రూ.ఐదున్నరవేలేనా జగన్ సార్?

YSR Rythu Bharosa: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో పెట్టుబడి కింద రుణం ఇష్తోంది రూ. 5.500 మాత్రమే. దీంతో తామేదో ఘనకార్యం చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తోంది. కానీ రైతులకు మాత్రం ఏ మాత్రం లాభం చేకూరడం లేదు. ఐదున్నర వేలు పెట్టుబడికి ఎక్కడ సరిపోతాయి. ప్రస్తుతం పెట్టుబడి అమాంతం పెరిగిపోతోంది. కౌలు కూడా ఎక్కువగానే ఉంటోంది. దీంతో రైతులు వ్యవసాయం చేయాలంటే గగనమే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం చెబుతున్న దానికి ఇస్తున్న దానికి పొంతన కుదరడం లేదు పైగా తామేదో రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వమని బింకాలు పలుకుతోంది.

YSR Rythu Bharosa
CM Jagan

కేంద్ర ప్రభుత్వం కూడా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది. వాటిని కూడా తామే ఇస్తున్నట్లుగా వైసీపీ చెప్పుకుంటోంది. దీంతో బీజేపీ నేతల్లో ఆగ్రహం వస్తోంది. తమ పథకాలను మావే అని చెప్పుకుంటూ మోసం చేస్తున్న వైసీపీ ఆగడాలను ఎండగట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ తీరుపై విమర్శలు పెరుుతున్నాయి. కేంద్రం ఇస్తున్న డబ్బును కూడా తామే ఇస్తున్నట్లుగా చెప్పుకోవడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. బీజేపీ నేతలు వైసీపీ విధానాల తీరుకు ఆక్షేపిస్తున్నారు. తమ ప్రభుత్వం ఇస్తున్న వాటిని తమ ఖాతాలో చూపించుకుంటూ రైతులను మోసం చేయడాన్ని ఖండిస్తున్నారు.

Also Read: North Korea: ఉత్తరకొరియాలో ఏం జరుగుతోంది.? ప్రపంచానికి మరో వినాశనమా?

కేంద్రం పీఎం కిసాన్ పేరుతో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది. కేంద్రం ఇచ్చే నిధులు దాదాపు ముప్పై లక్షల మందికి రావడం లేదని తెలుస్తోంది. దీంతో వారు ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఈ క్రమంలో రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా మారుతోంది. మీదికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న వైసీపీ రైతులకు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం ని చెబుతున్నా వారికి దక్కేది మాత్రం ఆ ఐదువేల అయిదు వందలే కావడం గమనార్హం.

అధికారంలోకి రాకముందు పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్ రైతులకు హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి రైతులకు రూ. 12 వేలు ఇస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక మాట మర్చారు. కేంద్రం ఇస్తోంది కదా అంటూ రూ.5,500 ఇస్తున్నారు. కేంద్రం ఇచ్చే వాటితో సరిపెట్టుకోవాలని చెబుతున్నారు. రైతుల్లో ఆందోళన నెలకొంది. పెట్టుబడి సాయం ఎక్కడకు సరిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ విధానాలను ఎండగడుతున్నారు.

YSR Rythu Bharosa
jagan

గత ప్రభుత్వాలు ఒకేసారి రూ. 50 వేలు రుణమాఫీ చేసి రైతుల మోములో సంతోషం నింపారు. కానీ జగన్ మాత్రం ఏ సాయం చేయకుండా అరకొరగా ఇస్తూ రైతులను మోసం చేస్తోంది. రాబోయే ఎన్నికల్లో జగన్ కు మాత్రం ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో వైసీపీకి గడ్డు రోజులే రానున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా జగన్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి విమర్శలే ఎదుర్కొంటున్నారు. రైతులు 2024లో జరిగే ఎన్నికల్లో కీలెరిగి వాత పెట్టనున్నట్లు చెబుతున్నారు.

Also Read:Shock To Tarak Fans: తారక్ ఫాన్స్ కి కోలుకోలేని షాక్ KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్

Recommended Videos:

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular