తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అని ఏపీ సీఎం జగన్ అంటారు. కానీ కోర్టులు ఒప్పుకోవు కదా.. అందుకే యవ్వారం బెడిసికొడుతోంది. అయితే తాను ముచ్చటపడి తెచ్చుకున్న వారి విషయంలోనైనా ఏపీ సీఎం న్యాయం చేయాలి కదా? అదీ చేయడం లేదు. దీంతో జగన్ నమ్ముకొని ఉన్నది అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏపీలో దాపురించాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జరిగిన ఓ సంఘటన ఇందుకు నిదర్శనంగా నిలిచిందని అంటున్నారు.
Also Read: మూడు రాజధానులపై తేల్చేసిన కేంద్రం
సీఎం జగన్ దూకుడు నిర్ణయాలు ఆయనకు మరిన్ని తలనొప్పులను తీసుకొస్తున్నాయి. జగన్ సర్కార్ పంతం పట్టి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ ను తప్పించి ఆ స్థానంలో కనకరాజ్ ను నియమించింది. అయితే హైకోర్టులో ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ తగలడంతో తిరిగి నిమ్మగడ్డనే ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ విధుల్లోకి తీసుకోవాల్సి వచ్చింది. ఈ వ్యవహారంలో సీఎం జగన్ తనపై ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకెళ్లారు. అయితే ఫలితం మాత్రం దక్కలేదు.తాజాగా మాజీ ఎన్నికల కమిషనర్ వ్యవహారం మరో వివాదానికి దారితీసినట్లు కన్పిస్తోంది. జగన్ సర్కార్ హడావుడి ఏపీ ఎన్నికల కమిషనర్ గా కనగరాజ్ ను నియమించిన సంగతి తెల్సిందే. తమిళనాడు నుంచి ఉన్నఫలంగా కనకరాజ్ ను ఏపీకి రప్పించి పోస్టింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన విజయవాడలోని బెంజిసర్కిల్ లోని ల్యాండ్ మార్క్ ప్రైడ్ అపార్టమెంట్లోని డీ-3 బ్లాకులో అద్దెకు దిగారు.
నాటి నుంచి ఇప్పటివరకు ఆయను ఉన్న ప్లాట్ కు అద్దె చెల్లించకపోగా ఉన్నఫలంగా ఖాళీ చేసేందుకు యత్నించడం వివాదానికి దారితీసింది. గత ఏప్రిల్ 11న కనకరాజ్ ఆ ప్లాట్ లో అద్దెకు దిగాక ఆరునెలల నుంచి అద్దె చెల్లించలేదని తెలుస్తోంది. దీనికి పంచాయతీ రాజ్ అధికారులు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇటీవల కనగరాజ్ నియామకాన్ని హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం ఆ ఇంటి అద్దె చెల్లించే అవకాశం కన్పించడం లేదని తెలుస్తోంది.
ప్రస్తుతం కనగరాజ్ పదవీ లేనందున ఆ బిల్లుకు తమకు సంబంధం లేదని పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ఓనర్ రవీంద్రనాథ్ తో తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆ ప్లాట్లోని ఫర్నిచర్ తరలించేందుకు యత్నించడంతో ఆయన అడ్డుకున్నారు. తనకు రావాల్సిన డబ్బులు 7లక్షల రూపాయలు చెల్లించి సామాన్లు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో అధికారులు ఆయనపై మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read: ఇల్లు అలకగానే పండుగ కాదు.. జగన్?
దీనిపై ఓనర్ రవీంద్ర నాథ్ స్పందిస్తూ తనకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయి అడిగితే తిరిగి తనపై కేసు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించాడు. అద్దె చెల్లించకుండా అధికారులు ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. తనకు అధికారులు అగ్రిమెంట్ లెటర్ ఇచ్చి సామన్లు తీసుకెళ్లొచ్చన్నారు. పోలీసులు కూడా ఓనర్ కు అగ్రిమెంట్ ఇవ్వాలని అధికారులకు సూచించగా వారు ఫర్నీచర్ తీసుకోకుండానే వెళ్లినట్లు తెలుస్తోంది. దీనిపై ఓనర్ రవీంద్రనాథ్ న్యాయస్థానంలో తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నాడు.
జగన్ సర్కార్ కు ఇప్పటికే పలుమార్లు న్యాయస్థానాల్లో మెట్టికాయలు తినగా… మరోసారి మెట్టికాయలు తప్పవనే అభిప్రాయం ఈ ఉదంతంతో వ్యక్తం అవుతోంది. జగన్ సర్కార్ దూకుడు కారణంగా కనగరాజ్ బలికాగా.. సర్కారుకు అద్దె ఇచ్చినా పాపానానికి ఓ సామన్యుడు అన్యాయం అయిపోవడం శోచనీయంగా మారింది. ఇప్పటికైనా జగన్ సర్కార్ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటుందా? లేదో వేచి చూడాల్సిందే..!