బుల్లితెర పై విపరీతంగా క్రేజ్ ను సంపాదించిన వ్యక్తులు ఈ మధ్య చాలామందే పుట్టుకొచ్చారు. వారిలో ప్రస్తుతం తరుచుగా వినిపిస్తోన్న పేరు.. శేఖర్ మాస్టర్. ఆయనకు నిజంగా క్రేజ్ ఎంత ఉందో తెలియదు గానీ, రోజాతో ఆయనగారు చేసే బ్రేకింగ్ స్టెప్స్ మాత్రం ఫుల్ గా వైరల్ అవుతూ ఉంటాయి. ఎలాగూ కొరియోగ్రాఫర్ గా స్టార్ హీరోలకు కొత్త కొత్త స్టెప్పులను కంపోజ్ చేసే శేఖర్ మాస్టర్, తన కోసం కూడా కొత్త కొత్త స్టెప్స్ ను డిజైన్ చేసుకుంటూ బుల్లితెర ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నారు. ముఖ్యంగా ఢీ, జబర్దస్త్, అలాగే అప్పుడప్పుడు చేసే స్పెషల్ ఈవెంట్లలో శేఖర్ మాస్టర్ చేసే హడావుడి మాములుగా ఉండదు అనేంతగా ఆయనగారు బుల్లితెరపై దూసుకుపోతున్నారు. ఆయన ఒక్కడే రెచ్చిపోతే పోయారు. కానీ, ఆయనతో పాటు మాజీ బ్యూటీల చేత కూడా తనతో పాటు బ్రేకింగ్ స్టెప్స్ వేయిస్తూ యూత్ కి కూడా ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ను అందిస్తున్నాడు.
Also Read: పాపం నిర్మాతలు.. తగ్గనంటున్న క్రియేటివ్ డైరెక్టర్ !
దీనికితోడు రోజా, ప్రియమణి, వర్షిణి, రష్మీలాంటి వారు కూడా శేఖర్ మాస్టర్ తో ఎప్పుడెప్పుడు సందడి చేద్దామా అని ఎదురుచూస్తున్నట్లు ఉంటారు. ముఖ్యంగా రోజా, ప్రియమణిలతో ఆయన చేసే డ్యాన్స్ పర్ఫామెన్స్ కు ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ కూడా ఎప్పటికప్పుడు ఫిదా అవుతూ ఉంటారు. అయితే గత కొన్ని రోజులుగా ఇవన్నీ మిస్ అవుతున్నాయని నెటిజన్లు తెగ ఫీల్ అవుతున్నారు. శేఖర్ మాస్టర్ గత కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉంటున్నాడని.. అసలు ఢీ షోలో జడ్జ్‌గా కూడా రావడం లేదని.. ఆయన ప్లేస్‌లో జానీ మాస్టర్ వస్తోండటంతో సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ వినిపించాయి. శేఖర్ మాస్టర్ కు కరోనా వచ్చిందని.. నాలుగు వారాల క్రితమే ఆయన కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నాడని వార్తలు వచ్చాయి. కానీ అప్పుడు ఈ వార్తలు పై ఎవ్వరూ స్పందించలేదు.
Also Read: టాలీవుడ్ ఇక ఓటీటీ బాట పట్టినట్టేనా?
కాగా తాజాగా శేఖర్ మాస్టర్ కి కరోనా రావడం నిజమే అని తేలింది. అయితే ఆయనకు ప్రస్తుతం కరోనా తగ్గింది. ఆయన తన ప్లాస్మాను కూడా దానం చేశాడు. ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘నాకు గత నెలలోనే కరోనా వచ్చిన మాట వాస్తవం. నేను కిమ్స్ హాస్పిటల్‌లో జాయిన్ అయి.. ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు కరోనా నెగెటివ్ వచ్చింది. అయితే ఎవరికో అవసరం ఉందని చెప్పడంతో ప్లాస్మాను దానం చేసేందుకు.. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి వచ్చి ప్లాస్మాను దానం చేశాను. దయచేసి కరోనా నుండి బయటపడిన అందరూ ప్లాస్మాను దానం చేయండి.. దాని వల్ల ఓ ఇద్దరి ప్రాణాలను కాపాడిన వారవుతారు. నేను ప్లాస్మాను డొనేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను’ అంటూ ఈ క్రేజీ మాస్టర్ ముగించాడు.