మాటల కోటలు.. చర్యలేవి కేసీఆర్ సార్

భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను ఊహించి అంచనా వేయడం.. ముందుగానే ప్రజల మీదకు ఒకరాయి విసరడం.. చివరకు అదే నిజమైతే.. ‘నేను ముందే చెప్పానా.. అలా జరుగుతుందని..? నా మాట ఎవరైనా విన్నారా’ అంటూ ప్రచారాలు చేసుకోవడం. సరిగా ఇది తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌‌కు యాప్ట్‌ అవుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఎన్నికల టైంలో ఇలాంటి రాజకీయాలే చూశాం. ‘నేను స్పెషల్‌గా సర్వే చేయించిన. మనకు వంద సీట్లు పక్కా’ అనే మాటలు విన్నాం. ఒకట్రెండు అటుఇటుగా సీట్లు […]

Written By: NARESH, Updated On : September 10, 2020 2:44 pm
Follow us on

భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను ఊహించి అంచనా వేయడం.. ముందుగానే ప్రజల మీదకు ఒకరాయి విసరడం.. చివరకు అదే నిజమైతే.. ‘నేను ముందే చెప్పానా.. అలా జరుగుతుందని..? నా మాట ఎవరైనా విన్నారా’ అంటూ ప్రచారాలు చేసుకోవడం. సరిగా ఇది తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌‌కు యాప్ట్‌ అవుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఎన్నికల టైంలో ఇలాంటి రాజకీయాలే చూశాం. ‘నేను స్పెషల్‌గా సర్వే చేయించిన. మనకు వంద సీట్లు పక్కా’ అనే మాటలు విన్నాం. ఒకట్రెండు అటుఇటుగా సీట్లు రానే వచ్చాయి. మళ్లీ సేమ్‌ డైలాగ్‌ రిపీట్.

Also Read : ఆ తెలంగాణ జైత్రయాత్రకు 42 ఏళ్లు 

చాలా సందర్భాల్లో కేసీఆర్‌‌ ప్రెస్‌మీట్లలో ఇలాంటి చవాకులు విసురుతూనే ఉంటారు. ఇప్పుడు సరిగా కరోనా ఎపిసోడ్‌లోనూ అదే జరిగింది. అసెంబ్లీలో కరోనా ఎపిసోడ్‌లో తమ ప్రభుత్వం చేసిన పనుల గురించి.. వాటి గొప్పతనం గురించి అదే పనిగా చెప్పుకున్న కేసీఆర్.. ప్రైవేటు ఆసుపత్రులపైనా కస్సుమన్నారు. కరోనా ట్రీట్‌మెంట్‌కు ప్రైవేటు ఆస్పత్రులకు పర్మిషన్‌ ఇస్తే వారు వైద్యానికి పీడిస్తారని చెప్పానని.. అయినా పలువురు వినిపించుకోకుండా విమర్శలు చేశారని.. తప్పనిసరి పరిస్థితుల్లో ఇచ్చామని.. ఇప్పుడు ప్రైవేటు హాస్పిటల్స్‌ వాళ్లు ఇబ్బందులు పెడుతున్నారని.. తాను చెప్పింది నిజమైందని అన్నారు. ‘డబ్బుల కోసం శవాలతో పీడించడం కరెక్ట్‌ కాదు. ఇంత దుర్మార్గంగా సంపాదించి ఏం చేస్తారో తెలియదు. లోకమంతా ఇబ్బందుల్లో ఉంటే.. ఇప్పుడు డబ్బులు సంపాదిస్తారా? వారు ఎవరైనా కానీ.. ఏ ఆసుపత్రి అయినా కానీ కఠిన చర్యలు తీసుకుంటాం’ అని మండిపడ్డారు.

‘ప్రైవేటు ఆస్పత్రుల దుర్మార్గంపై అంచనా వేసే వాటికి అనుమతులు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. కానీ.. ఐసీఎంఆర్ పదిహేను ఆసుపత్రులకు అనుమతి ఇచ్చింది. తాము అనుమతి ఇవ్వకుంటే ఎవరో హైకోర్టుకు వెళ్లారు. కోర్టు ఆదేశాల్ని అమలు చేశాం’ అని చెప్పారు. అయితే..  . పీక్కుతునే ప్రైవేటు ఆసుపత్రుల ఆరాచకానికి ఎందుకు కట్టడి చేయలేకపోయారు..? చర్యలు తీసుకుంటామని ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా చెబుతున్న కేసీఆర్.. ఇంతకుముందే ఆ పని ఎందుకు చేయలేదు..? ఏదో నామమాత్రంగా రెండు ఆస్పత్రులకు కరోనా పర్మిషన్‌ తొలగించి.. మిగతా వాటిని ఎందుకు వదిలేశారు..? ఇప్పుడు అసెంబ్లీలో వార్నింగ్‌లు ఇవ్వడం కాదు.. పేషెంట్లను పట్టిపీడిస్తున్న ఆస్పత్రుల పర్మిషన్‌ క్యాన్సిల్‌ చేయాలని సర్వత్రా డిమాండ్‌ వ్యక్తమవుతోంది.

Also Read : భూతగాదాలు, రిజిస్ట్రేషన్ కష్టాలు ఉండవిక