Homeఆంధ్రప్రదేశ్‌AP CID: జగన్ లండన్ వెళ్లాడు.. ఏపీ సిఐడి నవ్వుల పాలైంది

AP CID: జగన్ లండన్ వెళ్లాడు.. ఏపీ సిఐడి నవ్వుల పాలైంది

AP CID: మొన్నటిదాకా మార్గదర్శి మీద జగన్ వేసిన ఎత్తులకు తిరిగి లేదు. ఏపీ సిఐడి సంధించిన ప్రశ్నలకు రామోజీరావు దగ్గర సమాధానం లేదు. ఇక రామోజీరావు పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. తన తండ్రి వల్ల కానిది జగన్ చేస్తున్నాడు అని ఉండవల్లి అరుణ్ కుమార్ నుంచి మొదలు పెడితే కేవీపీ రామచంద్ర రావు గారు భావించారు. ఇప్పటివరకు రాజు గురువుగా పేరుపొందిన రామోజీరావును కదిలిస్తున్న ఘనతను జగన్ సొంతం చేసుకున్నాడు అని అందరూ కీర్తించడం మొదలుపెట్టారు. కానీ ఒకే ఒక తప్పు జగన్ లక్ష్యాన్ని దూరం చేసింది. ఏపీ సిఐడిని నవ్వులపాలయ్యేలా చేసింది. టిడిపి మీసం మెలేసేలా చేసింది. ఈనాడును సేఫ్ జోన్ లో నిలబెట్టింది. ఇంతకీ ఏం జరిగింది?

మార్గదర్శి విషయంలో నిబంధనలను పాటించడం లేదని.. చిట్స్ పాడిన వారికి సకాలంలో డబ్బులు ఇవ్వడం లేదని, ఖాతాల నిర్వహణ సక్రమంగా లేకుండా హైదరాబాద్ కు నగదు తరలిస్తున్నారని, అత్యంత రిస్క్ తో కూడి ఉండే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెడుతున్నారని.. వీటి మీదే ఇన్నాళ్లు ఏపీ సిఐడి ప్రధానంగా ఫోకస్ చేసింది. ఈ విషయాల మీద సమాధానాలు రాబట్టేందుకు రామోజీరావును, ఆయన కోడలిని ప్రశ్నించింది. మార్గదర్శి సిబ్బందిని ఇంటరాగేట్ చేసింది. ఈ వరుస పరిణామాలతో రామోజీరావు కుంగి పోయాడు. ఇతర పత్రికలకు జాకెట్ స్థాయిలో మార్గదర్శి సుద్దపూస అని యాడ్స్ ఇచ్చాడు. ఇప్పటిదాకా జాగ్రత్తగానే నరుక్కు వచ్చిన సిఐడి ఒకసారిగా పప్పులో కాలేసింది. జగన్ లండన్ వెళ్లిన వెంటనే నవ్వుల పాలైంది.

మార్గదర్శి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన ఏపీ సిఐడి దారితప్పినట్టు కనిపిస్తోంది. చిట్స్ వేసి పాడుకొని డబ్బులు కట్టకుండా ఎగ్గొట్టన వారిని తీసుకువచ్చి మార్గదర్శి మోసం చేసిందని ఏపీ సిఐడి అధికారులు కేసులు పెట్టించారు. గతంలో ఇలాగే ఒక తప్పుడు ఫిర్యాదు తీసుకుని విజయవాడ పోలీస్ కమిషనర్ ఏకంగా తన ఆఫీసులోనే ఫిర్యాదుదారుడిని కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టారు. దీనిని కోర్టు తప్పు పట్టడంతో ఆయనకు స్థాన చలనం తప్పలేదు. ఏపీ సిఐడి కూడా ఇప్పుడు అదే పని చేసింది. ఓ మహిళలు తీసుకొచ్చి ఆమె ఫిర్యాదు చేసింది అని చెప్పి కేసు పెట్టింది. ఆమె ప్రెస్ మీట్ లో చెప్పిన విషయాలు చూస్తే మాత్రం మార్గదర్శిది తప్పేమీ లేదు అన్నట్టుగా కనిపిస్తోంది.

పూర్ణ అనే మహిళ పౌల్ట్రీ ఫామ్ వ్యాపారం చేస్తోంది. ఆమె మొదట తన ఆర్థిక పరిస్థితి ఆధారంగా మార్గదర్శిలో 90 చిట్స్ వేసింది. వాటిలో డబ్బులు కట్టలేక 17 చిట్స్ డిఫాల్ట్ అయ్యాయి. మిగతా చిప్స్ పాడుకుని ష్యూరిటీ ఇచ్చి నగదు తీసుకుంది. కానీ తర్వాత కట్టడం మానేసింది. నిబంధనల ప్రకారం మార్గదర్శి యాజమాన్యం నోటీసులు ఇచ్చింది. షూరిటీ ఉన్నవారిని డబ్బులు వసూలు చేసింది. ఇదే విషయాన్ని ఆమె ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు. అయితే ఆమె తమ కుమార్తె సంతకాలు ఫోర్జరీ చేసి.. చిట్స్ పాడారని.. ఆమె ప్రస్తుతం విదేశాల్లో ఉందని ప్రకటించింది. కానీ అన్నపూర్ణ సంతకాన్ని మార్గదర్శి యాజమాన్యం బయట పెట్టడంతో ఒక్కసారిగా కాను తినడం ఏపీ సిఐడి వంతు అయింది. డబ్బులు తీసుకున్నామని ఆమె చెబుతున్నప్పుడు, కట్టకుండా ఉన్నందుకు నోటీసులు పంపారని అంటున్నప్పుడు.. ఇక్కడ తప్పు ఎలా అవుతుందని మార్గదర్శి యాజమాన్యం అంటోంది. ఇంతటి రామోజీరావును ప్రశ్నించిన ఏపీ సిఐడి అధికారులు.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో అంతు పట్టకుండా ఉంది. తమ మీద ఎవరైనా తప్పుడు ఫిర్యాదులు చేస్తే ఏపీసీఐడీ అధికారులు రాచ మర్యాదలు చేస్తున్నారని మార్గదర్శి యాజమాన్యం ఆరోపిస్తోంది. సిఐడి అధికారి సంజయ్ ఇదే ప్రెస్ మీట్ లో తమ మీద రకరకాల ఆరోపణలు చేశారని.. వాటిని కోర్టులో ఎందుకు చెప్పడం లేదని మార్గదర్శి వాదిస్తోంది. అన్నపూర్ణ ఉదంతాన్ని నిన్న లైవ్ లో చూపించిన సాక్షి యాజమాన్యం.. ఈరోజు ఉదయం నుంచి దాన్ని పట్టించుకోవడం మానేసింది. అంటే సిఐడి వేసిన అడుగులో పస లేదు అనే కదా అర్థం! మరి జగన్ లండన్ నుంచి వచ్చిన తర్వాత అయినా మార్గదర్శి మీద సరైన చర్యలు తీసుకుంటారా? సిఐడి అధికారులను మార్చుతారా? అనేవి తేలాల్సి ఉంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version