https://oktelugu.com/

మోడీని ఆ కోరిక కోరిన జగన్

ప్రధాని మోడీని ఏపీ సీఎం జగన్ మరో కోరిక కోరాడు. ప్రైవేటు ఆస్పత్రులు వినియోగించని వ్యాక్సిన్లను ప్రభుత్వానికి కేటాయించాలని ఎవరూ అడగని ప్రశ్నను ప్రధాని ముందుంచారు. ఎందుకంటే ఇప్పుడు దేశమంతా కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్లను ఇస్తోంది. దీంతో బాగా డబ్బున్న వాళ్లు తప్పితే అందరూ ఉచిత వ్యాక్సిన్ నే వేసుకుంటున్నాడు. దీంతో ప్రైవేటు ఆస్పత్రులకు కేటాయించిన వ్యాక్సిన్లు అన్నీ వృథా అయిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ ఈ కోరిక కోరాడు. వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి […]

Written By:
  • NARESH
  • , Updated On : June 29, 2021 / 09:36 PM IST
    Follow us on

    ప్రధాని మోడీని ఏపీ సీఎం జగన్ మరో కోరిక కోరాడు. ప్రైవేటు ఆస్పత్రులు వినియోగించని వ్యాక్సిన్లను ప్రభుత్వానికి కేటాయించాలని ఎవరూ అడగని ప్రశ్నను ప్రధాని ముందుంచారు. ఎందుకంటే ఇప్పుడు దేశమంతా కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్లను ఇస్తోంది. దీంతో బాగా డబ్బున్న వాళ్లు తప్పితే అందరూ ఉచిత వ్యాక్సిన్ నే వేసుకుంటున్నాడు. దీంతో ప్రైవేటు ఆస్పత్రులకు కేటాయించిన వ్యాక్సిన్లు అన్నీ వృథా అయిపోతున్నాయి.

    ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ ఈ కోరిక కోరాడు. వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి ప్రధానికి జగన్ మరోసారి లేఖ రాశారు. కేంద్రప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రుల వద్ద పెద్ద ఎత్తున వ్యాక్సిన్లు మిగిలిపోతున్నాయని ప్రధాని దృష్టికి తెచ్చారు.

    జూలై నెలలో దేశవ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రులకు 17,71,580 డోసులు కేటాయించారు. ఇంత పెద్ద మొత్తంలో వ్యాక్సిన్లను ప్రైవేటు ఆస్పత్రులు వినియోగించుకునే అవకాశం లేదు. ఇప్పటివరకు ప్రైవేటు ఆస్పత్రులు కేవలం 2,67,075 వ్యాక్సిన్లను మాత్రమే వినియోగించాయి. ఈ క్రమంలోనే ఏపీకి వాటిని కేటాయించాలని సీఎం జగన్ భిన్నమైన కోరికను కోరాడు.

    ఏపీలో రికార్డు స్థాయిలో వ్యాక్సిన్లు వేసే అవకాశం ఉన్నప్పటికీ తగినన్ని డోసులు లేకపోవడంతో వ్యాక్సినేషన్ నెమ్మదిగా నడుస్తోంది. వ్యాక్సినేషన్ వేగవంతం చేసేందుకు ప్రైవేటు ఆస్పత్రులు తీసుకోని వ్యాక్సిన్ నిల్వలను ప్రభుత్వానికి కేటాయించాలని జగన్ కోరారు.