కరోనా సోకిన వాళ్లకు షాకింగ్ న్యూస్.. ఆ వ్యాధి వచ్చే ఛాన్స్..?

దేశంలో కరోనా కేసుల సంఖ్య, కరోనా మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా సోకిన వాళ్లకు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ల కంటే ముఖ పక్షవాతం వచ్చే అవకాశాలు 7 రెట్లు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. వైద్య పరిభాషలో ఈ వ్యాధిని బెల్స్ పాల్సీ అంటారని అయితే వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కొందరికి కూడా బెల్స్ పాలీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం. యూనివర్శిటీ హాస్పిటల్ క్లీవ్‌ల్యాండ్ మెడికల్ సెంటర్, కేస్ వెస్ట్రన్ రిజర్వ్ […]

Written By: Navya, Updated On : June 30, 2021 10:28 am
Follow us on

దేశంలో కరోనా కేసుల సంఖ్య, కరోనా మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా సోకిన వాళ్లకు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ల కంటే ముఖ పక్షవాతం వచ్చే అవకాశాలు 7 రెట్లు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. వైద్య పరిభాషలో ఈ వ్యాధిని బెల్స్ పాల్సీ అంటారని అయితే వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కొందరికి కూడా బెల్స్ పాలీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం.

యూనివర్శిటీ హాస్పిటల్ క్లీవ్‌ల్యాండ్ మెడికల్ సెంటర్, కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు. అయితే బెల్స్ పాల్సీ కేసులు తక్కువగానే ఉన్నాయని సమాచారం. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం లక్ష కరోనా కేసులలో 82 బెల్స్ పాల్సీ కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో లక్ష మందిలో 19 కేసులు మాత్రమే నమోదయ్యాయని సమాచారం.

3,48,000 కరోనా బాధితులలో 284 బెల్స్ పక్షవాతం ఉన్న రోగులను శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ పక్షవాతం బారిన పడిన వాళ్లలో 54 శాతం మంది రోగులకు బెల్స్ పక్షవాతం పూర్వపు చరిత్ర లేకపోయినా 46 శాతం మందికి మాత్రం పూర్వపు చరిత్ర ఉంది. బెల్స్ పాల్సీ బారిన పడితే ముఖ కండరాలు బలహీనపడి ముఖం సగం వేలాడుతూ కనిపిస్తుంది

శరీరాన్ని రక్షించే రోగనిరోధక వ్యవస్థలో అధిక ప్రతిచర్య వలన నరాల వ్యవస్థ దెబ్బతింటుందని అందువల్లే బెల్స్ పాల్సీ వస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ఫైజర్, మోడెర్నా కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్‌లో కూడా బెల్స్ ఫాల్సీ కేసులు కనిపించడం గమనార్హం.