Jagan VS Sharmila: ఏపీ ముఖ్యమంత్రి జగన్, సోదరి షర్మిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుముంటుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. సోషల్ మీడియాలో, పత్రికలలో వస్తున్న కథనాలన్నీ పుకార్లేనని ఆయా పార్టీల నేతలు మొన్నటి వరకు కోట్టేసినా, ఇటీవల వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమంలో జరిగిన ఘటన ఇందుకు బలం చేకూరుస్తుంది. ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పుడే అయిపోలేదు.. అసలు ట్విస్ట్ హైదరాబాదులో ఉందని అంటున్నారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని రెండు రోజుల క్రితం ఇడుపులపాయలో ఘనంగా నిర్వహించారు. ఆయన సమాధి వద్ద నివాళులర్పించేందుకు ముందుగా షర్మిల తన కూతురు, కొడుకుతో కలిసి చేరుకున్నారు. అనంతరం జగన్ వెళ్లారు. అయితే, మీడియాకు రానివ్వకుండా ముందుగానే కట్టడి చేశారు. అధికంగా జనం వస్తారు కాబట్టి ఎవరూ రావాల్సిన అవసరం లేదు.. ప్రభుత్వం నుంచి ఫొటోలు, వీడియోలు ఏర్పాటు చేస్తామంటూ ముందుగానే ఓ ప్రకటన జారీ చేశారు. దీంతో సాధారణంగా ప్రభుత్వ మీడియా ముఖ్యమంత్రి జగన్ కే ప్రాధాన్యమిస్తుందనడంలో సందేహం లేదు.
కాగా, షర్మిలకు మీడియా ప్రతినిధులు ఎవరూ కనబడకపోవడంతో విషయమేంటని ఆరా తీసింది. ఎవరయ్యా.. అలా చేయమని చెప్పింది అంటూ తన స్వంత మీడియాతో పలువురు మీడియా వారిని రావాలని ఆహ్వానించింది. దీంతో ఆమె ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. అక్కడే ఆమె ఆస్తి పంపకాల పత్రాలను తన కూతరు, కొడుకు పేరు మీద బదలాయించింది. ఈ ఒక్క ఘటన చాలదా అన్నా, చెల్లెలు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకోబోతున్నాయన్నది అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
ఇక, అసలు ట్విస్టంతా హైదరాబాదులోనే జరగబోతుందట. ఇడుపులపాయలో షర్మిల ఆస్తి పంపకాలను చేసిన తరువాత, హైదరాబాదులోని ఆస్తులను కూడా పంచేయడానికి సిద్ధమవుతున్నారు. తండ్రి వర్థంతి సభలోనే ఇరువురు బలనిరూపణకు దిగిన వైనంతో వైసీపీ నాయకులు ఖంగుతిన్నారు. ఇప్పుడు హైదరాబాదులో ఇరువురి మధ్య ఏం జరగబోతుందోనన్న ఉత్కంఠ ఎక్కువైంది. గుంభనంగా ఉన్న విబేధాలు ఒక్కసారిగా బట్టబయలైతే పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా, ఆర్జీవీ ‘జగన్ VS షర్మిల’ సినిమా తీయాలని ప్రతిపక్షాల నుంచి డిమాండ్ ఎక్కవవుతోంది.