
స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీలోని వైసీపీ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. లాక్‌డౌన్ ముందు వరకు కూడా స్థానిక సంస్థల మీద ఊపుమీద ఉన్న జగన్ ఇప్పుడు ఆ ఎన్నికలపై పెద్దగా ఇంట్రస్ట్ చూపడం లేదు. ఎస్‌ఈసీ మార్పు వల్లే ఇదంతా అనేది అందరికీ అర్థమవుతూనే ఉంది. కానీ.. అటు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మాత్రం ఎన్నికలు నిర్వహించేందుకు తన ఏర్పాట్లు తాను చేసుకుంటున్నారు.
Also Read: కన్నా వద్దన్నారు.. సోమువీర్రాజు తీసుకున్నారు..!
ఈ మేరకు నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డను కలిసి ప్రభుత్వం తరఫున నివేదిక ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే పరిస్థితి రాష్ట్రంలో లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో కరోనాను నియంత్రిస్తున్నాం కానీ పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని నివేదికలో చెప్పారు.
రాష్ట్రంలో కరోనా ఇంకా అదుపులోకి రాలేదని ఆమె తెలిపారు. ఎప్పటికప్పుడు దీనిపై నివేదికలు ఇస్తామని, పరిస్థితి సానుకూలంగా ఉన్నప్పుడు తాము తెలియచేస్తామని సీఎస్ వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడ్డారని ఆమె తెలిపారు. సుమారు 11 వేల మంది పోలీసులు కరోనాకు గురయ్యారని ఆమె చెప్పారు.ఈ భేటీలో పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Also Read: ఏపీ స్థానిక ఎన్నికల్లో పోటీచేస్తాం: జనసేన
మరి ప్రభుత్వం ఇచ్చిన ఈ నివేదికను బేస్ చేసుకొని ఎస్‌ఈసీ ఎన్నికలను వాయిదా వేసుకుంటారా..? లేక నిర్వహించాల్సిందేనంటూ పట్టుబడుతారా..? ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు పార్టీలతో సమావేశం కావాలని డిసైడ్ అయిన ఆయన నిర్ణయం మున్ముందు ఎలా ఉండబోతోంది..? ఇప్పుడంతా ఇదే చర్చ నడుస్తోంది ఏపీలో.