AP Cabinet: కేబినెట్ ప్రక్షాళన దిశగా జగన్? ఏం జరగబోతోంది?

AP Cabinet: ముఖ్యమంత్రి జగన్‌లో మార్పు కనబడుతోంది. నిన్న మొన్నటి వరకు రాబోయేది కూడా తమ రాజ్యమేనని అనుకుంటున్న ఆయనకు ఎమ్మెల్సీ మంచి గుణపాఠాన్ని నేర్పాయి. ఆ దెబ్బతో ప్రధాన అనుచరగణంపై, సర్వే టీములపై చిందులు తొక్కినట్లు ఆయన, పరిస్థితులను చక్కదిద్దుకునే పనిలో పడిపోయారు. అందులో భాగంగా కేబినెట్ ప్రక్షాళన చేసి పాలనను గాడిలో పట్టే చర్యలకు ఉపక్రమించారు. నిన్న జరిగిన ఎమ్మెల్యేల భేటీలో ఆ మేరకు హింట్ వార్తలు వినిపిస్తున్నాయి. ముందుస్తు వెళ్లే నష్టమనేనా? ముందస్తుకు […]

Written By: SHAIK SADIQ, Updated On : April 4, 2023 3:12 pm
Follow us on

AP Cabinet

AP Cabinet: ముఖ్యమంత్రి జగన్‌లో మార్పు కనబడుతోంది. నిన్న మొన్నటి వరకు రాబోయేది కూడా తమ రాజ్యమేనని అనుకుంటున్న ఆయనకు ఎమ్మెల్సీ మంచి గుణపాఠాన్ని నేర్పాయి. ఆ దెబ్బతో ప్రధాన అనుచరగణంపై, సర్వే టీములపై చిందులు తొక్కినట్లు ఆయన, పరిస్థితులను చక్కదిద్దుకునే పనిలో పడిపోయారు. అందులో భాగంగా కేబినెట్ ప్రక్షాళన చేసి పాలనను గాడిలో పట్టే చర్యలకు ఉపక్రమించారు. నిన్న జరిగిన ఎమ్మెల్యేల భేటీలో ఆ మేరకు హింట్ వార్తలు వినిపిస్తున్నాయి.

ముందుస్తు వెళ్లే నష్టమనేనా?

ముందస్తుకు వెళ్లే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేసిన ముఖ్యమంత్రి జగన్ ప్రజల్లో గ్రాఫ్ పెంచుకునే పనిలో పడినట్లు తెలుస్తుంది. వై నాట్ 175 అని చెప్పిన ఆయన ఆ మేరకు రిజల్ట్ భవిష్యత్తులో లేదని ఆయనకు తత్వం బోధపడినట్లు ఉంది. ప్రజల్లో వ్యతిరేకత ప్రస్ఫుటంగా ఉన్న వేళ, పోస్టుమార్టానికి సిద్ధమయ్యారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆసక్తికర అంశాలను వెల్లడించారు. కొంతమంది ఎమ్మెల్యేలను సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడులయితే, ప్రభుత్వానికి టీడీపీకి వచ్చే సీట్లు కూడా రావని తెలిసొచ్చినట్లుంది.

పార్టీయే ముఖ్యం

వ్యక్తుల కంటే పార్టీయే ముఖ్యమని చెప్పుకొచ్చిన జగన్ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల రిపోర్టులను పరిశీలిస్తున్నారు. ఏ ఒక్క స్థానాన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేనని తేల్చి చెప్పేశారు. ఈ క్రమంలో మంత్రి వర్గంలో మార్పులు ఉంటాయని సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. అటువంటిదేమి లేదని చెబుతూనే, పాత నీరును మళ్లీ మంత్రి వర్గంలో తీసుకుంటే మేలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయా ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పటికే ఉన్న మంత్రుల్లో ఎవరిని తొలగిస్తారని టెన్షన్ మొదలైంది.

AP Cabinet

మంత్రుల్లో స్థానచలనం వీరికే?

ఎన్నికలకు ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో పార్టీ గ్రాఫ్ పెంచుకునే క్రమంలో మంత్రులకు స్థానం చలనం కల్పించేందుకు సిద్ధమైనట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఫల్యాలకు కారణాలుగా ఉత్తరాంధ్ర, రాయలసీమలో మంత్రులను చూపుతూ వారిని తొలగించనున్నట్లు తెలుస్తోంది. వీరిలో విడదల రజని, దాడిశెట్టి రాజా, సిదిరి అప్పలరాజు, ఉషశ్రీ చరణ్ తదితరులకు ఉద్వాసన పలికే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. వీరి స్థానంలో పాత వారినే అంటే కొడాలి నాని, పేర్ని నాని, తోట త్రిమూర్తుల, బాలనేని శ్రీనివాసరెడ్డీలను మంత్రి వర్గంలో చోటు కల్పించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇదే జరిగితే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, పార్టీ ఎమ్మెల్యేల్లోను రాక మానదు. గుంభనంగా ఉన్న అసంతృప్తి బాంబు పేలడంతో పెద్ద సమయమేమి పట్టదు.