అది 2009, సెప్టెంబర్ 2 ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి రచ్చబండ అనే కార్యక్రమానికి హెలికాప్టర్ లో బయల్దేరారు. మార్గం మధ్యలో ప్రమాదవశాత్తు ఆయన మరణించారు. కట్ చేస్తే.. 2020 సెప్టెంబర్ లో ప్రజలను చేరుకునేందుకు జగన్ కూడా సిద్ధమయ్యారు. ఏడాది పూర్తయిన నేపథ్యంలో ప్రజానాడిని నేరుగా తెలుసుకునేందుకు ఆయన రెడీ అయ్యారు. తన తండ్రి స్ఫూర్తితో రచ్చబండ అనే పేరుతో ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని అనుకున్నారు. కానీ, జగన్ మాతృమూర్తి విజయలక్ష్మి మాత్రం దీనికి మరో పేరు పెట్టుకోవాలని సూచించారని సమాచారం. దీంతో “గ్రామసభ” అని పేరు ను ఖరారు చేయనున్నట్టు తెలిసింది.
అదే సమయంలో వైఎస్ హెలీకాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో జగన్ ఈ కార్యక్రమానికి హెలీకాప్టర్ ను వినియోగించకూడదని పార్టీ సీనియర్లు కోరుతున్నట్టు సమాచారం. ఆ కార్యక్రమానికి-హెలికాప్టర్ కు సెంటిమెంటు ఉందని అంటున్నారు. దీంతో జగన్ కూడా ఈ సెంటిమెంటుకే మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. సెప్టెంబరులోనే కార్యక్రమాన్ని ప్రారంభించినా.. కార్యక్రమానికి రచ్చబండ పేరుకి మారుగా “గ్రామసభ” హైలికాప్టర్ బదులుగా మరో వాహనం ఉపయోగించాలని నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది.
గ్రామసభ ద్వారా జగన్ మంచి సీఎం అనిపించుకున్నారా? ఆయన నిర్ణయాలకు ప్రజలు జై కొడుతున్నారా? సీఎంగా జగన్ అద్భుతాలు చేస్తున్నారని అంటున్నారా? జగన్ ప్రభుత్వంలో మాకు కంటినిండా నిద్ర పడుతోందని ఫీలవుతున్నారా? ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం ప్రజలుకి చేరుతోందో లేదో తెలుసుకునేందుకు వీలౌతోంది. ఎంత టెక్నాలజీ ఉన్నా.. ఎన్నిసర్వేలు ఉన్నా.. నేరుగా ప్రజల నోటి నుంచి వచ్చే మాటే తెలియజేస్తోంది ఆయన జగన్ ఉత్తమ సీఎం..? లేక వుత్తోతి సీఎం? అని మరి ఈ విషయం తెలియాలంటే మరి కొన్ని రోజులు ఎదురుచూడాలి..!