https://oktelugu.com/

ప్రకాశ్‌ రాజ్‌ వెబ్‌ ఎంట్రీ

ప్రకాశ్ రాజ్‌. విలక్షణ నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న యాక్టర్. ఏ పాత్ర చేసినా దానికి ప్రాణం పోసే నటుల్లో ప్రకాశ్‌ ముందుంటాడు. హీరోగా చేసినా.. హీరోకు తండ్రిగా, తాతగా నటించినా.. విలన్‌గా చేసినా ఇచ్చినా ఏ  పాత్ర లోనైన లీనమైపోతాడు. నటుడిగానే కాకుండా రచయిత, దర్శకుడిగా కూడా మెప్పించాడు. ఆర్టిస్ట్‌గా అన్ని భాషల్లో విపరీతమైన క్రేజ్‌ ఉన్నా కూడా ‘ధోనీ’, ‘ఉలవచారు బిర్యానీ’, ‘మన ఊరి రామాయణం’ వంటి చిత్రాలు తెరకెక్కించి విమర్శల ప్రశంసలు […]

Written By: , Updated On : July 2, 2020 / 02:40 PM IST
Follow us on


ప్రకాశ్ రాజ్‌. విలక్షణ నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న యాక్టర్. ఏ పాత్ర చేసినా దానికి ప్రాణం పోసే నటుల్లో ప్రకాశ్‌ ముందుంటాడు. హీరోగా చేసినా.. హీరోకు తండ్రిగా, తాతగా నటించినా.. విలన్‌గా చేసినా ఇచ్చినా ఏ  పాత్ర లోనైన లీనమైపోతాడు. నటుడిగానే కాకుండా రచయిత, దర్శకుడిగా కూడా మెప్పించాడు. ఆర్టిస్ట్‌గా అన్ని భాషల్లో విపరీతమైన క్రేజ్‌ ఉన్నా కూడా ‘ధోనీ’, ‘ఉలవచారు బిర్యానీ’, ‘మన ఊరి రామాయణం’ వంటి చిత్రాలు తెరకెక్కించి విమర్శల ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు వెబ్‌ మీడియాలో కూడా అడుగు పెడుతున్నాడు. తొలిసారి ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నాడు.

హైదరాబాద్ లో నో-లాక్‌డౌన్.. కారణాలివే?

ఇటీవల జ‌రిగిన యదార్థ ఘ‌ట‌న‌ల‌ ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారటని, ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభమైందని సమచారం. ఇందులో మరో విశేషం ఏమిటంటే దీనికి ప్రకాశ్‌ రాజ్‌ రచయితగా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ వెబ్‌ సిరీస్‌ను నిర్మిస్తోంది. ఇది ఏ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్‌ అవుతుందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌. దీనిపై త్వరలోనే అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రావొచ్చు. మరోవైపు పవన్‌ కళ్యాణ్‘వకీల్‌ సాబ్‌’, అల్లు అర్జున్‌ ‘పుష్ప’ సినిమాల్లో ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. ఇంకోవైపు కరోనా కష్టకాలంలో తన ఫౌండేషన్‌ ద్వారా వేలాది మందికి సాయం చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడీ విలక్షణ నటుడు. తన సిబ్బందికి రెండు నెలల జీతాలు అడ్వాన్స్‌గా చెల్లించిన ప్రకాశ్.. వలస కార్మికులకు తన ఫామ్‌హౌజ్‌లో వసతి కల్పించాడు. సొంత ఖర్చులతో వారిని స్వస్థలాలకు పంపించాడు. ఈ మధ్య కర్నాటకలోని పలువురు విద్యార్థులకు కూడా ఆశ్రయం కల్పించి పెద్ద మనసు చాటుకున్నాడు.