https://oktelugu.com/

మరో భారీ ఆఫర్ కొట్టేసిన రష్మిక!

రష్మిక మందన్న. తెలుగులో ఇప్పుడు సెన్సేషనల్‌ హీరోయిన్. ఛలో అనే చిన్న మూవీతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ కన్నడ బ్యూటీ గీత గోవిందం చిత్రంతో ఇక్కడ పాతుకుపోయింది. వరుస అవకాశాలు రావడం, చేసిన సినిమాలన్నీ విజయాలు సాధిస్తుండడంతో ఆమె కెరీర్ గ్రాఫ్‌ అమాంతం పెరిగింది. ఒక రకంగా ఇప్పుడు టాలీవుడ్ లో రష్మిక టైమ్‌ నడుస్తోంది. రష్మిక నటించిన గత రెండు చిత్రాలు సరిలేరు నీకెవ్వరు, భీష్మ.. సూపర్ హిట్స్‌ కావడంతో స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్ల […]

Written By:
  • admin
  • , Updated On : June 22, 2020 / 02:04 PM IST
    Follow us on


    రష్మిక మందన్న. తెలుగులో ఇప్పుడు సెన్సేషనల్‌ హీరోయిన్. ఛలో అనే చిన్న మూవీతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ కన్నడ బ్యూటీ గీత గోవిందం చిత్రంతో ఇక్కడ పాతుకుపోయింది. వరుస అవకాశాలు రావడం, చేసిన సినిమాలన్నీ విజయాలు సాధిస్తుండడంతో ఆమె కెరీర్ గ్రాఫ్‌ అమాంతం పెరిగింది. ఒక రకంగా ఇప్పుడు టాలీవుడ్ లో రష్మిక టైమ్‌ నడుస్తోంది. రష్మిక నటించిన గత రెండు చిత్రాలు సరిలేరు నీకెవ్వరు, భీష్మ.. సూపర్ హిట్స్‌ కావడంతో స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్ల కన్ను ఆమెపై పడింది. ఈ క్రమంలో సుకుమార్-, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తున్న పాన్‌ ఇండియా మూవీ ‘పుష్ప’లో అవకాశం ఆమెను వరించింది. ఈ చిత్రంలో రష్మిక ఫస్ట్‌ టైమ్‌ డిగ్లామర్ రోల్‌ పోషిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు తన పాత్రుకు తానే డబ్బింగ్‌ చెప్పుకోనుందట. ఫారెస్ట్‌ బ్యాక్‌ డ్రాప్‌లో గంధం చక్కల స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే ‘పుష్ప’ కోసం కొత్త యాస కూడా నేర్చుకుంటోందంట.

    జగన్ నెక్స్ట్ టార్గెట్ ఆ మాజీ మంత్రేనా?

    మరోవైపు తన మాతృక కన్నడలో ‘పొగరు’ సినిమాలో ధృవ సర్జతో కలిసి నటిస్తోందామె. అలాగే, కార్తి సరసన ‘సుల్తాన్‌’తో తమిళ్‌లో అడుగు పెట్టనుంది. ఈ మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది. తెలుగు, కన్నడ, తమిళ్‌ మూడు భాషల్లో చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న రష్మికను మరో భారీ ఆఫర్ వరించిందట. తమిళ సూపర్ స్టార్ విజయ్‌ 65వ మూవీలో హీరోయిన్‌ రష్మికనే అనే వార్త కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. వాస్తవానికి విజయ్‌ గత చిత్రం ‘మాస్టర్’లోనే ఆమె నటించాల్సింది. కానీ ఏవో కారణాల వల్ల అది కుదరలేదు. కానీ, అరచేతిలో అదృష్ట రేఖ ఎక్కువే ఉన్న మందన్నను వెతుక్కుంటూ మరో ప్రాజెక్ట్‌ వచ్చింది. పైగా ఇది మామూలు సినిమా కాదు. మురుగదాస్ – విజయ్ కాంబోలో భారీ విజయం సాధించిన తుపాకీకి సీక్వెల్‌ అట. ఫస్ట్‌ పార్ట్‌లో నటించిన కాజల్ అగర్వాల్‌నే ఎంచుకున్నారని మొదట వార్తలు వచ్చినా ఇప్పుడు మందన్న వైపే మురుగదాస్‌ మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఈ వార్త నిజమైతే కోలీవుడ్‌లో కూడా రష్మిక హవా మొదలవడం ఖాయమే.