జగన్ జీవితంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఆమె కొడుకు రాహుల్ గాంధీ, ఏపీలో చంద్రబాబును ఎన్నడూ మరిచిపోరు కావచ్చు. ఎందుకంటే జగన్‌కు వీరికన్నా వేరే శత్రువులు కూడా ఎవరూ లేరు. జగన్‌ను 16 నెలలు జైల్లో పెట్టించి ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో అందరికీ తెలిసిందే. అందుకే.. వీరి ముఖం చూడ్డానికి కూడా ఆయన ఇష్టపడరు.
Also Read: కరోనాపై బాబు ఇక గప్‌చుప్..ఆంతర్యం ఏంటీ?
అన్ని కష్టాలను దాటి జగన్ అధికారంలోకి వచ్చేశారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్‌తో జత కట్టే పరిస్థితి లేదు. దీంతో జగన్ .. మోడీకి దగ్గరవుతున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా మోడీని జగన్ ఆకాశానికి ఎత్తుతూనే ఉన్నారు. జగన్ సీఎం అయిన కొత్తలో తిరుపతికి వచ్చిన మోడీ పాదాలకు జగన్ ఏకంగా నమస్కారం చేశారు. అది జగన్ మెంటాలిటీకి పెద్దగా నచ్చని వ్యవహారమే. కానీ.. మోడీ దృష్టిలో ఉండాలన్నా, మోడీ సపోర్టు దొరకలన్నా ఇవన్నీ చేయక తప్పదనుకున్నాడు.
ఇక రాజకీయంగా తలపండిన మోడీ జగన్‌లోని ఈ బలహీనతను చూసి తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. జగన్ ఏ పరిస్థితుల్లో అయినా సోనియాతో జత కట్టరు. అది మోడీకి బాగా తెలుసు. అంతేకాదు ఏపీలో చంద్రబాబుతో ఏళ్లుగా కొనసాగుతున్న వైరం. దీంతో జగన్‌కు తన కంటే వేరే ఆధారం లేదన్న సంగతి మోడీకి అర్థమైపోయింది. అయితే జగన్‌కు 28 మంది ఎంపీల బలం ఉంది. ఆ బలం తీసుకుంటూ మోడీ తన బిల్లులను పాస్ చేయించుకుంటున్నారు.
కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏ బిల్లు పెట్టినా జగన్ కనీసం విమర్శలు చేయకుండా.. ఎలాంటి అభ్యంతరాలు తెలుపకుండానే మద్దతు ఇస్తున్నారు. ఇదంతా చేస్తున్నా మోడీ జగన్‌కు ఏమైనా సహాయం చేస్తున్నారా అంటే అదీ లేదు. గత నెలలో పోలవరం కోసం తాము ఖర్చు చేసిన నిధులను విడుదల చేయాలని కేంద్రానికి జగన్ లేఖ రాశారు. కానీ.. అందులో 760 కోట్ల నిధులకు కొర్రీలు పెట్టింది. మిగిలిన వాటిని నెమ్మదిగా విడుదల చేస్తామని తాపీగా చెప్పుకొచ్చారు. ఇక ఏపీకి ఆర్థిక ప్యాకేజీలు ప్రత్యేకంగా ఏమీ ఇవ్వడంలేదు. అప్పులు చేసుకుని పప్పు కూడు వండుకోమంటున్నారు. ప్రత్యేక హోదా ఊసే లేదు, ప్యాకేజీ అంతకన్నా లేదు. మరోవైపు జగన్ సొంత సమస్యలైనా కేంద్రం పరిష్కరిస్తోందా అంటే అదీ లేదు. అమరావతి రాజధాని భూముల విషయంలో సీబీఐ విచారణ కోరుతూ ఆరు నెలల క్రితం జగన్ లేఖ రాస్తే బుట్టదాఖలు చేశారు.
Also Read: ఆంధ్ర రాజకీయాల్లో బిజెపి ఎంటర్ అయినట్లే
అలాగే శాసన మండలి రద్దు విషయంలో జగన్ మాట నెగ్గలేదు, వైసీపీ రెబెల్ ఎంపీ రఘు రామ క్రిష్ణంరాజు జగన్ మీద నిత్యం రెచ్చిపోతున్నారు. ఆయన ఎంపీ సభ్యత్వం రద్దు చేయండి అని జగన్ మొరపెట్టుకున్నా స్పందించలేదు. ఇవన్నీ చూస్తున్న జగన్ అయినా కూడా మోడీకి ఎందుకు మద్దతునిస్తున్నారు అనేది రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.