Also Read: వైసీపీ ఎమ్మెల్యేకు కోర్టు షాక్… కేసు పెట్టాలని ఆదేశాలు..?
కానీ.. ఇప్పుడు ఆ రాష్ట్రంలో జరుగుతున్నదంతా అపోజిట్. వైసీపీ, బీజేపీ మధ్య ఓ విధంగా రాజకీయ యుద్ధమే జరుగుతోంది. అది కూడా మతపరమైన యుద్ధమే. హిందుత్వమే అజెండాగా నడిచే పార్టీ బీజేపీ. ఈ మధ్య ఏపీలో హిందూ దేవాలయాలపై నిత్యం జరుగుతున్న దాడులతో బీజేపీ దూకుడు పెంచింది. ప్రభుత్వంపై ఫైర్ అవుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు ఏకంగా దీక్షలకు దిగారు. శుక్రవారం ఛలో అమలాపురంకు పిలుపునిచ్చినా జగన్ ప్రభుత్వం బ్రేక్ వేసింది. కమల రథాన్ని కదలకుండా చేసింది. ఎక్కడికక్కడ నేతలను హౌజ్ అరెస్ట్ చేయించింది. ఈ మొత్తం ఎపిసోడ్ చూశాక ఏపీలో బీజేపీనే ప్రధాన ప్రతిపక్షం అనిపిస్తోంది.
శాంతిభద్రతల పేరిట బీజేపీ చేపట్టిన ఛలో అమలాపురం కార్యక్రమాన్ని భగ్నం చేసింది జగన్ ప్రభుత్వం. బీజేపీని ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా అడ్డుకుంది. దీంతో బీజేపీకి వైసీపీకి మధ్య అగాధం మరింత పెరిగినట్లైంది. ఏకంగా ఏపీలో నియంత పాలన నడుస్తోందంటూ జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ దూకుడుకు మూకుతాడు వేయాలని జగన్ గట్టిగా డిసైడ్ అయ్యారని సమాచారం.
Also Read: సీఐని బెదిరించిన వైసీపీ ఎమ్మెల్యే.. ఫోన్ సంభాషణ లీక్?
ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా నిలవాల్సిన టీడీపీ సైలెంట్ అయిపోయింది. బీజేపీ స్టేట్ చీఫ్‌గా సోము వీర్రాజు వచ్చాక ఎక్కడ చూసినా కాషాయ జెండాలే కనిపిస్తున్నాయి. వెంటవెంటనే కార్యకవర్గాన్ని ప్రకటించారు. వచ్చీ రాగానే చలో అంతర్వేది అన్నారు. చలో అమలాపురం అన్నారు. ఇక జిల్లాల టూర్లు అంటూ జోరు పెంచుతున్నారు. కొత్త కార్యవర్గంలోని మెంబర్స్‌కు తమ బాధ్యతలను గుర్తుచేస్తూ ఆందోళనలోకి రంగ ప్రవేశం చేయిస్తున్నారు. వీటన్నింటిపై జగన్ కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఎక్కడా మీడియా ఫోకస్ బీజేపీ మీద పడకుండా జాగ్రత్త పడుతున్నాడు. అటు కేంద్రం.. ఇటు రాష్ట్ర పరిణామాలు చూస్తున్న ప్రజల్లో ఇప్పుడు కొత్త కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో చంద్రబాబుని టార్గెట్ చేసి.. ఆ పార్టీని నామ రూపాలు లేకుండా చేయడానికే బీజేపీ, వైసీపీలు ఈ డ్రామాలు ఆడుతున్నాయా..? సోము, జగన్ మధ్య అండర్‌స్టాండింగ్‌తోనే ఈ కథ అంత నడిపిస్తున్నారా..? కేంద్రంలో వియ్యం.. రాష్ట్రంలో కయ్యం అన్నట్లుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు..? అటు రాజకీయ వర్గాల్లో.. ఇటు ప్రజల్లో ఇదే చర్చ నడుస్తోంది.