https://oktelugu.com/

జగన్ కలల పాలనకు శరాఘాతంగా ‘కరోనా’!

కరోనా కాటుకు అందరూ బలవుతున్నారు. దేశాలైనా, వ్యక్తులైనా, వ్యవస్థలైనా కుదేలవుతున్నాయ. ప్రపంచమే గాడి తప్పుతోంది. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో కరోనా కకావికలం చేస్తోంది. వ్యవస్థను అస్తవ్యస్తంగా మార్చుతోంది. రాష్ర్టాన్ని అధోగతి చేస్తోంది. ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ఫలితంగా అప్పుల ఊబిలోకి మారిపోతోంది. అయినా జగన్ అప్పులు చేసి మరీ సంక్షేమ కార్యక్రమాలు ఆగకుండా చర్యలు చేపడుతున్నారు. చంద్రబాబు అనుకూల మీడియా జగన్ సర్కారుపై లేనిపోని ఆరోపణలు చేస్తోంది. జగన్ హామీలు గాలికొదిలేశారని, నవరత్నాలు […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 1, 2021 / 10:23 AM IST
    Follow us on

    కరోనా కాటుకు అందరూ బలవుతున్నారు. దేశాలైనా, వ్యక్తులైనా, వ్యవస్థలైనా కుదేలవుతున్నాయ. ప్రపంచమే గాడి తప్పుతోంది. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో కరోనా కకావికలం చేస్తోంది. వ్యవస్థను అస్తవ్యస్తంగా మార్చుతోంది. రాష్ర్టాన్ని అధోగతి చేస్తోంది. ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ఫలితంగా అప్పుల ఊబిలోకి మారిపోతోంది. అయినా జగన్ అప్పులు చేసి మరీ సంక్షేమ కార్యక్రమాలు ఆగకుండా చర్యలు చేపడుతున్నారు.

    చంద్రబాబు అనుకూల మీడియా జగన్ సర్కారుపై లేనిపోని ఆరోపణలు చేస్తోంది. జగన్ హామీలు గాలికొదిలేశారని, నవరత్నాలు రాలిపోయాయని అంటూ రాద్ధాంతాలు చేస్తోంది. జగన్ మాత్రం అలాంటి అవకాశం ఇవ్వకుండా చక్కగా ప్రణాళిక ప్రకారం చేస్తున్నారు. దీంతో బాబు తిప్పలు ఎవరు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం మీడియా కొత్త పల్లవి అందుకుంటోంది. జగన్ సర్కారు కరోనా కట్టడికే కాలం సరిపోతుందని చెబుతోంది. ఇప్పటికే సంక్షేమ కార్యక్రమాల అమలులో దూసుకుపోతుంటే బాబు మాత్రం నిందలు వేయడమే ధ్యేయంగా ముందుకు కదులుతున్నారు.

    రాష్ర్టంలో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. ప్రతి మండలంలో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాల నిర్మాణాలు చేపట్టారు. ఇళ్ల స్థలాల పంపిణీ చేశారు. రోడ్ల మరమ్మతుల కోసం భారీగా నిధులు కేటాయించారు. పనులు జరగకుండా ప్రతిపక్షం కోర్టు ద్వారా అడ్డం పడే పనులు నిరంతరం చేస్తూనే ఉన్నారు దీంతో పరిపాలన ముందుకు సాగడం లేదు.

    సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తయినట్లు వ్యంగ్యాస్ర్తాలు ఎక్కుపెడుతున్నాయి. కోర్టుల ద్వారా పనులు అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. దీంతో పల్లెల్లో అభివృద్ధి పనులు జరిగినా జరగలేదనే విధంగా ప్రచారం కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ సర్కారుకు అనేక మర్గాల్లో అడ్డుపుల్లలు పడుతూనే ఉన్నాయి.