జగన్ మొండి పట్టుతో మార్పు.. అనూహ్య పరిణామం..

రాష్ర్ట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు.. ఇటు రాజకీయ వర్గాల్లోనూ.. అటు అధికారుల్లోనూ.. తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. సీఎం జగన్ ఆదేశాల మేరకు.. సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ను ఆర్టీసీ ఎండీగా నియమించారు. ప్రస్తుతం ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగానికి ఎండీగా ఉన్న ఆయన్ను.. రెండు రోజుల క్రితం ఆర్టీసీ ఎండీగా చేశారు. అయితే ప్రభుత్వంలో ఇలాంటి బదిలీలు సాధారణమే అయినప్పటికీ.. ఠాకూర్ ను ఇలా అనూహ్యంగా ఒక ప్రాధాన్యత పోస్టులోకి తీసుకోవడం […]

Written By: Srinivas, Updated On : January 28, 2021 12:06 pm
Follow us on


రాష్ర్ట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు.. ఇటు రాజకీయ వర్గాల్లోనూ.. అటు అధికారుల్లోనూ.. తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. సీఎం జగన్ ఆదేశాల మేరకు.. సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ను ఆర్టీసీ ఎండీగా నియమించారు. ప్రస్తుతం ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగానికి ఎండీగా ఉన్న ఆయన్ను.. రెండు రోజుల క్రితం ఆర్టీసీ ఎండీగా చేశారు. అయితే ప్రభుత్వంలో ఇలాంటి బదిలీలు సాధారణమే అయినప్పటికీ.. ఠాకూర్ ను ఇలా అనూహ్యంగా ఒక ప్రాధాన్యత పోస్టులోకి తీసుకోవడం వెనక సరికొత్త వ్యూహం ఉందని పలువురు పరిశీలకులు అంటున్నారు.

Also Read: ఎస్ఈసీపై పెద్దిరెడ్డి.. సజ్జల తిట్ల దండకం..

వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఠాకూర్ డీజీపీగా కొనసాగారు. ఈ సమయంలో జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేసిన సమయంలో విశాఖలో ఆయనపై కోడికత్తి దాడి జరిగింది. ఈ సమయంలో వైసీపీ నేతలే దీనికి కారణం అంటూ.. ఠాకూర్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ పరిణామం.. ఠాకూర్కు.. వైసీపీకి మధ్య నిప్పుల కుంపటిని రాజేసింది. ఇక ఎన్నికల సమయంలోనూ దూకుడుగా ప్రవర్తించాలని అనుకున్న ఠాకూర్.. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యంతో సైలెంట్ అయిపోయారు. ఇక గత ఎన్నికల తరువాత వైసీపీ ప్రభుత్వం కొలువు దీరింది.

ఈ నేపథ్యంలో ఠాకూర్ ను ఉన్నపళంగా.. సీఎం జగన్ బదిలీ చేశారు. ఎలాంటి ప్రాధాన్యత లేని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగానికి ఎండీని చేశారు. దాదాపు ఏడాదిన్నర కాలం ఆయన అక్కడే పని చేస్తున్నారు. అయితే ఇప్పడు ప్రభుత్వం తానంతట తాను ఠాకూర్ కు కీలకమైన పదవి.. అదీ అర్టీసీ ఎండీ పోస్టును అప్పగించింది. ఇదేదో.. యాదృచ్చికమో.. లేదా అధికారులు చేసిన బదిలీనో కాదు. ఒక వ్యూహం మేరకు ఆర్టీసీలోకి బదిలీ చేశారంటున్నారు విశ్లేషకులు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే.. కచ్చితంగా మంచి పోస్టులే ఇస్తామనే సంకేతాలు వైసీపీ గవర్నమెంటు పంపిందనే అలికిడి.

Also Read: నిమ్మగడ్డ బదిలీ చేసిన అధికారులకు జగన్ అందలం

అయితే గతానికి.. ఇప్పటికీ.. అధికారుల విషయంలో జగన్ వైఖరి మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.ఈ వ్యూహం ఫలిస్తే.. రాజకీయంగా జగన్ సక్సెస్ అంటున్నారు. ఎందుకంటే..ఇటీవల కాలంలో మాజీ ఇంటిలిజెన్స చీఫ్ ఏబీ. వెంకటేశ్వరరావు విషయలో ప్రభుత్వం ఐపీఎస్ అధికారుల నుంచి కొన్ని విమర్శలు ఎదుర్కొంది. ఈ క్రమంలో అలాంటి వాటినుంచి కూడా తప్పుకునేందుకు ఠాకూర్ను వ్యూహాత్మకంగా ఆర్టీసీ పీఠంపై కూర్చోబెట్టిందని పలువురు అంటున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్