
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ భయబ్రాంతులకు గురి చేస్తున్న నేపథ్యంలో.. వైరస్ వ్యాప్తి చెందకుండా పీఎం మోడీ లాక్ డౌన్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఏపి సిఎం జగన్ ప్రజలను ఉద్దేశించి ఈ రోజు సాయంత్రం మీడియాతో మాట్లాడారు. దేశ ప్రధాని చెప్పిన విధంగా అందరూ ఆదివారం రోజు దీపాలు వెలిగించాలని కోరారు. కులాలకు, మతాలకు అతీతంగా ప్రజలు అందరూ కలిసి దీపాలు వెలిగించాలని కోరారు. లాక్ డౌన్ ను ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు. భౌతిక దూరం పాటిస్తూ కరోనాపై అందరూ యుద్దం చేయాలని కోరారు.
జాతీయవాదాన్ని చాటి చెబుతూ.. రేపు (ఏప్రిల్ 5) రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లను ఆపి.. దీపాలను, కొవ్వత్తులను, మొబైల్ టార్చ్ లను వెలిగించి.. కరోనా చీకట్లను తరిమికొట్టాలని మోడీ దేశ ప్రజలను కోరిన విషయం తెలిసిందే..