పరిషత్‌ లోనూ సామాజిక న్యాయం.. ఎమ్మెల్యేలకు చెక్!

ఏపీ సీఎం జగన్ తనదైన శైలిలో రాజకీయాలను నడిపిస్తున్నారు. ఇప్పటికే పథకాలతో ప్రతి ఒక్కరినీ ఆకట్టకుంటున్న ఆయన.. పదవుల పంపకాల్లోనూ సామాజిక న్యాయం పాటించాలని డిసైడ్‌ అయ్యారు. ఏపీలో ఉన్న సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని పదవుల పంపకాల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వైసీపీ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా.. మున్సిపల్‌ ఎన్నికల తర్వాత మేయర్‌, డిప్యూటీ మేయర్‌, చైర్మన్, వైస్‌ చైర్మన్ పదవుల తరహాలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పదవుల పందేరం చేపట్టాలని […]

Written By: Srinivas, Updated On : April 2, 2021 3:11 pm
Follow us on


ఏపీ సీఎం జగన్ తనదైన శైలిలో రాజకీయాలను నడిపిస్తున్నారు. ఇప్పటికే పథకాలతో ప్రతి ఒక్కరినీ ఆకట్టకుంటున్న ఆయన.. పదవుల పంపకాల్లోనూ సామాజిక న్యాయం పాటించాలని డిసైడ్‌ అయ్యారు. ఏపీలో ఉన్న సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని పదవుల పంపకాల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వైసీపీ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా.. మున్సిపల్‌ ఎన్నికల తర్వాత మేయర్‌, డిప్యూటీ మేయర్‌, చైర్మన్, వైస్‌ చైర్మన్ పదవుల తరహాలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పదవుల పందేరం చేపట్టాలని వైసీపీ నిర్ణయించింది.

ఏపీలో కులాల రాజకీయాలు ఎక్కువ. ఆ కేటగిరి రాజకీయాలను నిత్యం చూస్తుంటాం. కులాల ప్రభావం ఎక్కువగా ఉండే ఏపీలో అదే కులాల సమీకరణాలను ప్రయోగించడం ద్వారా ఆయా వర్గాల్లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా వైసీపీ అడుగులేస్తోంది. రెండేళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల్లో సోషల్‌ ఇంజినీరింగ్ సాయంతో అద్భుత విజయాన్ని అందుకున్న వైసీపీ ఇప్పుడు స్థానిక సంస్థల్లోనూ అదే ప్రయోగం చేయబోతోంది. దీంతో రాష్ట్రంలో తమకు రాజ్యాధికారం దక్కడం లేదని దశాబ్దాలుగా భావిస్తున్న పలు కులాలకు న్యాయం చేసే దిశగా వైసీపీ అడుగులు వేస్తోంది.

మరికొద్ది రోజుల్లోనే ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో కుల సమీకరణాలకు పెద్దపీట వేయాలని వైసీపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా మండల ప్రజాపరిషత్‌లో పదవుల విషయంలో గతంలో అవకాశాలు దక్కని వారికి అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ లోకల్‌ లీడర్లు తమ కులాలకు చెందిన వారికే ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. ప్రధానంగా.. అక్కడి ఎమ్మెల్యేలు కానీ.. మంత్రులు కానీ తమ కులాలకు ప్రాధాన్యం ఇచ్చారు. కానీ.. ఇప్పుడు జగన్‌ వాటిని మారుస్తూ నిర్ణయించారు. ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవుల్ని ఎవరికి ఇవ్వాల్నో ఎన్నికలకు ముందే నిర్ణయించేశారు.

ప్రధానంగా ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందిన వారికి ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవులు దక్కే అవకాశాలు లేవు. ఈ మేరకు వైసీపీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటివరకూ ఎమ్మెల్యేలు తమ ఆధిపత్యంతో ఈ పదవులను తమ అనుచరులకు, సామాజిక వర్గం వారికి ఇప్పించుకుంటుండగా.. వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో ఈ పదవులు ఇతర సామాజిక వర్గాలకు దక్కబోతున్నాయి. జగన్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుండగా.. ఎమ్మెల్యేల్లో మాత్రం నైరాశ్యం కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్