పులివెందుల పులి ఇలా అయిపోయిందేంటి?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన జగన్ అప్రతిహ విజయాలను అందుకున్నారు. ఊహించని సీఎం పీఠాన్ని సైతం అధిరోహించారు. పరిపాలనల తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్నారు. ఏపీలో నవరత్నాలు పథకాలతో ప్రజల హృదయాల్లో పదిలంగా చోటు సంపాదించుకుంటున్నారు. ప్రజారంజక పరిపాలనతో మెప్పిస్తున్నారు. సంక్షేమ పథకాలతో సానుభూతి పొందుతున్నారు. అయితే ఒక్క మచ్చ త ెచ్చుకుంటున్నారు. ప్రధానికి లొంగుతున్నారనే ప్రచారం ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఆయన ప్రతిష్టను గంగలో పడేస్తోంది. వైఎస్ఆర్ వారసుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన […]

Written By: Srinivas, Updated On : May 25, 2021 9:48 am
Follow us on

వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన జగన్ అప్రతిహ విజయాలను అందుకున్నారు. ఊహించని సీఎం పీఠాన్ని సైతం అధిరోహించారు. పరిపాలనల తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్నారు. ఏపీలో నవరత్నాలు పథకాలతో ప్రజల హృదయాల్లో పదిలంగా చోటు సంపాదించుకుంటున్నారు. ప్రజారంజక పరిపాలనతో మెప్పిస్తున్నారు. సంక్షేమ పథకాలతో సానుభూతి పొందుతున్నారు. అయితే ఒక్క మచ్చ త ెచ్చుకుంటున్నారు. ప్రధానికి లొంగుతున్నారనే ప్రచారం ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఆయన ప్రతిష్టను గంగలో పడేస్తోంది.

వైఎస్ఆర్ వారసుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన జగన్ ఆయన సాహసాన్ని పుణికిపుచ్చుకోలేదని చెబుతున్నారు. ఆయన దర్పం, పట్టుదల, దీక్ష ముందు ఎవరైనా దిగదుడుపే. పీసీసీ చీఫ్ అయిన పాతికేళ్ల వరకూ సీఎం సీట్లో కూర్చోలేదు. రాజీపడని వైఖరితోనే ముఖ్యమంత్రి పీఠం ఆయనకు ఎన్నోసార్లు దూరమైంది. అయినా మొక్కవోని దీక్షతో మళ్లీ ప్రయత్నించారు. కానీ ఎవరికి మోకరిల్లలేదు. అందుకే ఆయనను అందరూ జననేత అని పిలుస్తుంటారు. అలాంటి వైఎస్సార్ తనయుడిగా జగన్ భయస్తుడిగా ముద్ర పడుతున్నారు. పరపాలనలో దూసుకుపోతున్నా వ్యక్తిగత ప్రతిష్ట కో సం సిద్ధాంతాలను పాతరేస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది.

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రధానిపై విమర్శలు చేస్తే వాటిని జగన్ కొట్టిపారేయడంపై పెద్ద దుమారమే రేగుతోంది. జగన్ ప్రధాని మోదీకి మోకరిల్లారని చెబుతున్నారు. కేసుల నుంచి బయటపడటానికే జగన్ ఈ విధంగా చేస్తున్నారని బాహాటంగానే విమర్శిస్తున్నారు. పరోక్షంగా కేంద్రానికి మద్దతు తెలుపుతున్నారని వాపోయారు. ఆయనపై ఉన్నకేసుల మాఫీకే ఇలా చేస్తున్నారని చెబుతున్నారు. ఒడిశాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలాకా జగన్ ఇంకా ఎదగాలి అంటూ కౌంటర్ వేశారు.

తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో స్టాలిన్ సైతం జగన్ పై పరోక్షంగా కౌంటర్ వేశారు. ఆయనపై కేసులు ఉండడంతోనే మోడీకి లొంగుతున్నారని పేర్కొన్నారు. కానీ నేను అలా కాదని మాట్లాడారు. ఇవన్నీ చూస్తుంటే పులిలాంటి పులివెందుల బిడ్డ పిల్లి అయిపోయారా అని అనిపిస్తుంది. మోడీకి మద్దతు ఇవ్వడంతో సొంత పార్టీలోని వారే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ బెయిల్ రద్దు విషయం ఇప్పుడు రాజకీయంగా వేడి పుట్టిస్తున్న నేపథ్యంలో మోడీని వెనకేసుకు రావడంపై పెద్ద దుమారమే రేగుతోంది.