జగన్ మంత్రివర్గ వస్తరణపై దృష్టి పెట్టనున్నారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గ విస్తరణ చేపడతామని ముందే చెప్పిన జగన్ ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి. తనకు మంత్రి పదవి ఖాయమనుకున్నవారంతా ఇప్పుడు ఊహల డోలికల్లో ఊయలలూగుతున్నారు. ఎలాగైనా మంత్రి పదవి తనకు వస్తుందని ధీమాతో ఉన్నవారు చాలా మందే ఉన్నారు. ఏదేమైనా పనితీరుకే ప్రాధాన్యమిస్తున్నక్రమంలో ఎందరి పదవులు పోతాయోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మంత్రుల పనితీరుపై నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది.
ఆయా శాఖల మంత్రుల పనితీరు ప్రామాణికంగా మంత్రి పదవులు కేటాయించనున్నారు. ఇప్పటికే పలువురు శాఖల మంత్రుల పనితీరు బాగా లేదని బాహాటంగానే చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో మంత్రివర్గ విస్తరణలో ఎవరికి ప్రాధాన్యమిస్తారో ఎవరిని తొలగిస్తాోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా పనితీరు బాగా లేని వారిని ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. దీంతో వారు ఇంటి బాట పట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
కొత్త కేబినెట్ లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తాని తెలిసింది. ఇప్పటికే మేకపాటి సుచరిత, తానేటి వనిత, పుష్ప శ్రీవాణి ఉన్నారు. హోం శాఖ మంత్రిగా దళిత సామాజిక వర్గానికే చెందిన మహిళను నియమిస్తారని ప్రచారం సాగుతోంది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి కూడా విస్తరణలో మరో మహిళకు కేటాయిస్తారని తెలుస్తోంది. ఈ సారి మంత్రివర్గ విస్తరణలో రోజాకు కూడా స్థానం దొరుకుతుందని ప్రచారం కొనసాగుతున్నా చివరి వరకు వేచి చూడాల్సిందే. ఆమెకు పదవి వస్తుందో లేదో అదృష్టమెలా ఉందో తెలియాల్సి ఉంది.
విశాఖ, ప్రకాశం, కృష్ణా, తూర్పుగోదావరి, చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లో ప్రస్తుతమున్న మంత్రుల్లో కొందరికి ఉద్వాసన పలకనున్నారని సమాచారం. వారి స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన వారికే చోటు దక్కవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జగన్ మంత్రివర్గంలో ఈసారి ఆచితూచి పదవులు భర్తీ చేస్తారని చెబుతున్నారు. ప్రధానంగా రె డ్డి సామాజిక వర్గానికి వచ్చే కేబినెట్ లో ఎక్కువ పదవులు లభిస్తాయని అంటున్నారు. ఇదంతా ఎ న్నికల కేబినెట్ గా ఉంటుందని ప్రచారం సాగుతోంది.