AP CM Jagan: వైసీపీ ప్రజాప్రతినిధులకు జగన్ షాక్

AP CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ప్రజాప్రతినిధులు అధికారిక కార్యక్రమాల్లో వారి బంధుగణం పాల్లొనకూడదని హెచ్చరించింది. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు ఈ ఉత్తర్వులు షాకిచ్చాయి. ఏపీలో అధికారిక కార్యక్రమాల్లో కుటుంబ సభ్యుల పెత్తనంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అసలైన అభ్యర్థులు కాకుండా బంధుగణంతో పనులు చేయించడంతో ఏం చేయాలో అర్థం కాక పలు సందర్భాల్లో ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసిన […]

Written By: Srinivas, Updated On : August 22, 2021 5:15 pm
Follow us on

AP CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ప్రజాప్రతినిధులు అధికారిక కార్యక్రమాల్లో వారి బంధుగణం పాల్లొనకూడదని హెచ్చరించింది. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు ఈ ఉత్తర్వులు షాకిచ్చాయి. ఏపీలో అధికారిక కార్యక్రమాల్లో కుటుంబ సభ్యుల పెత్తనంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అసలైన అభ్యర్థులు కాకుండా బంధుగణంతో పనులు చేయించడంతో ఏం చేయాలో అర్థం కాక పలు సందర్భాల్లో ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినా వారిలో మార్పు కనిపించడం లేదు. అధికారులు కూడా అధికార పార్టీ కావడంతో ఏం అనలేక పోతున్నారు.

ప్రభుత్వానికి చెందిన ప్రజాప్రతినిధులు యథేచ్ఛగా తమ కుటుంబ సభ్యులతో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ సీఎం జగన్ కు ఆగ్రహం తెప్పిస్తున్నారు. దీంతో వారిపై చర్యలు తీసుకోవాలని సంకల్పించారు. బంధుగణం ఆగడాలు సాగకుండా అడ్డుకట్ట వేసేందుకు కార్యాచరణ ప్రకటించారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే వదిలిపెట్టొద్దని సూచించారు. దీంతో అధికారులు కొరడా ఝుళిపించారు. తమ కుటుంబ సభ్యుల్ని భాగస్వాముల్ని చేస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో సీఎం జగన్ చర్యలు చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్ లో అధికారిక సమావేశాల్లో ఇకపై ఎన్నికల్లో గెలిచిన వారే తప్ప ఇతరులు పాల్గొనరాదని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా ప్రవర్తిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడంత ప్రజాప్రతినిధుల్లో భయం పట్టుకుంది. పంచాయతీ రాజ్ వ్యవస్థలో నిబంధనలు పాటించాల్సిందేనని చెప్పారు.

అధికారిక కార్యక్రమాల్లో కుటుంబ సభ్యుల్ని భాగస్వాముల్ని చేస్తే చట్టపరంగా శిక్షార్హులవుతారని వివరించారు. వార్డు సభ్యులు, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీపీ తదితరులు అధికారిక కార్యక్రమాల్లో వారే పాల్గొని సహకరించాలని సూచిస్తున్నారు. ఎవరైనా ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘిస్తే పంచాయతీ కార్యదర్శి, ఎంపీవో, ఎంపీడీవో, డీపీవో, జెడ్పీ సీఈవో లపై కోడ్ ఆప్ కండక్ట్ రూల్స్ ప్రకారం చర్యటు తీసుకుంటామని హెచ్చరించారు.