Viral Video: దారుణం..పానీపూరిలో మూత్రం కలిపాడు

పానీ పూరి ప్రియులు ఈ వీడియో చూస్తే ఇక మీరు దాన్ని తినడానికి కూడా సాహసించరు. అంత దారుణంగా ప్రవర్తించాడో పానీ పూరి బండి యజమాని. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో చూస్తే ఇక మీరు బయట తిండి తినాలన్నా సంకోచించాల్సిన పరిస్థితి. పానీపూరి అంటే ఇష్టపడని వారు ఉండరు. రోజూ రోడ్డుపక్కన వెళ్లి మరీ కొందరు తింటుంటారు. అయితే ఇక నుంచి తినుబండారాల విసయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. తాజాగా […]

Written By: NARESH, Updated On : August 22, 2021 5:22 pm
Follow us on

పానీ పూరి ప్రియులు ఈ వీడియో చూస్తే ఇక మీరు దాన్ని తినడానికి కూడా సాహసించరు. అంత దారుణంగా ప్రవర్తించాడో పానీ పూరి బండి యజమాని. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో చూస్తే ఇక మీరు బయట తిండి తినాలన్నా సంకోచించాల్సిన పరిస్థితి.

పానీపూరి అంటే ఇష్టపడని వారు ఉండరు. రోజూ రోడ్డుపక్కన వెళ్లి మరీ కొందరు తింటుంటారు. అయితే ఇక నుంచి తినుబండారాల విసయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. తాజాగా వీడియో చూస్తే మీరు అస్సలు పానీపూరి తినడానికి సందేహిస్తారు.

అస్సాం రాష్ట్రంలోని గుహవాటి నగరంలో ఓ పానీ పూరి బండి నిర్వాహకులు చేసిన పని చూస్తే మీకు అసహ్యం వేస్తుంది. అత్యంత దారుణంగా అతడు చేశాడు. దీనిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

గుహవాటిలో వీధి వ్యాపారి అయిన ఓ పానీపూరి నిర్వాహకుడు తన మూత్రాన్ని నీటిలో కలిపేశాడు. యాప్రాన్ వేసుకున్న అతడు ఓ మగ్గుతో తన మూత్రాన్ని చాటుగా పట్టి దాన్ని ఏకంగా పానీపూరి బకెట్ లో కలిపాడు. ఈ వీడియోను ఎవరో చాటుగా తీసి సోషల్ మీడియాలో ఉంచారు. ఈ వీడియో వైరల్ అయ్యింది.

దీనిపై అస్సాం ఆహారశాఖ అధికారులు స్పందించి సదురు పానీ పూరి బండి వ్యాపారిని పోలీసులతో అరెస్ట్ చేయించారు. ఈ షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.