ఏపీలో మూడు రాజధానుల నిర్ణయం రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదనే చందాన కోర్టులో దాఖలవుతున్న పిటిషన్ల వల్ల మూడు రాజధానుల అమలు సాధ్యం కావడం లేదు. అయితే మూడు రాజధానుల నిర్ణయానికి కోర్టుల్లో అడ్డంకులు తొలగిన తరువాత జగన్ సర్కార్ అమరావతి రైతులకు మరో షాక్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Also Read : జగన్ ను ఢీకొంటున్న ఒకే ఒక్కడు ఇతడు!
అమరావతి రైతులు ఇచ్చిన భూములను జగన్ సర్కార్ ఇళ్ల పట్టాలుగా పంపిణీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు రైతులు కోర్టు మెట్లెక్కారు. దీంతో వైసీపీ ప్రభుత్వ పెద్దలు అమరావతిని శాసన రాజధానిగా ఉంచకుండా రైతులకు షాక్ ఇవ్వాలని భావిస్తున్నారని సమాచారం. వైసీపీ ముఖ్య నేతలే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో అమరావతిలో అసెంబ్లీ కూడా ఉండదని ప్రచారం జరుగుతోంది.
వైసీపీ మంత్రి కొడాలి నాని ఈ మేరకు నిర్ణయం తీసుకుని సీఎం జగన్ కు చెప్పారని… జగన్ ఆలోచించి నిర్ణయం తీసుకుందామని చెప్పారని ఒక ప్రణాళిక ప్రకారం జగన్ సర్కార్ అమరావతి నుంచి శాసన రాజధానిని తరలించే ప్రక్రియ చేపట్టబోతుందని తెలుస్తోంది. అమరావతి రైతులు మాత్రం వైసీపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందని చెబుతున్నారు. జగన్ సర్కార్ తమను బెదిరించాలని ప్రయత్నిస్తోందని వాపోతున్నారు.
తమకు శాసన రాజధాని ఉన్నా లేకపోయినా నష్టం లేదని రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలని తాము పోరాడుతునామని వాళ్లు తెలుపుతున్నారు. జగన్ సర్కార్ అమరావతి రైతులకు ఏ విధంగా షాక్ ఇవ్వబోతుందో చూడాల్సి ఉంది.
Also Read : బాబుకు షాక్.. అమరావతిపై జగన్ సీబీ‘ఐ’!