తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో రెవిన్యూ వ్యవస్థ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. రిజిస్ట్రేషన్లను నిలిపివేసి, వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి సంచలన నిర్ణయాల అమలుకు కేసీఆర్ శ్రీకారం చుట్టారు. రిజిస్ట్రేషన్ల శాఖ సిబ్బందికి ప్రభుత్వం కొన్ని రోజుల పాటు సెలవులు ఇచ్చింది. రెవిన్యూ వ్యవస్థ విషయంలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read : బాలకృష్ణను కెలికిన పోసాని… ఏం జరిగిందంటే….?
తెలంగాణ రాష్ట్రంలో తహశీల్దార్, వీఆర్వోలు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల సోదాల్లో పట్టుబడుతున్నారు. వీఆర్వోలు, తహశీల్దార్లు దాచిపెట్టిన అవినీతి సొమ్మును చూసి షాక్ అవ్వడం సోదాలకు వచ్చిన అధికారుల వంతవుతోంది. వీఆర్వోల, తహశీల్దార్ల అవినీతిపై ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఅర్ సైతం రెవిన్యూ శాఖలో అవినీతిని అంతమొందించాలని కొత్త రెవిన్యూ బిల్లును ప్రవేశపెట్టడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.
సీఎస్ కలెక్టర్లకు వీఆర్వోల దగ్గర ఉన్న రెవిన్యూ రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన కొన్ని గంటలెకి తెలంగాణ సర్కార్ వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడం గమనార్హం. సీఎం కేసీఆర్ రిజిస్టేషన్ల శాఖలో భారీగా మార్పులు చేయనున్నారని…. పూర్తిస్థాయిలో సమీక్షలు జరిపిన తరువాతే ఎమ్మార్వోలకు తెలంగాణ సర్కార్ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను అప్పగించనుందని తెలుస్తోంది.
కేసీఆర్ సర్కార్ గృహ వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లను సబ్ రిజిస్టార్లకు అప్పగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కొందరు అధికారులు ధనార్జనే లక్ష్యంగా అవినీతిని పాల్పడుతున్నారని తెలిసి సీఎం కేసీఆర్ రెవిన్యూ వ్యవస్థ ప్రక్షాళ దిశగా అడుగులు వేస్తున్నారు. మరి సీఎం కొత్త చట్టం ద్వారా అనుకున్నది సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది.
Also Read : హవ్వా.. బిగ్‌బాస్ కంటెస్టెంట్ల కులాలు వెతికారంట