https://oktelugu.com/

మందుబాబులకు మళ్లీ షాక్ ఇస్తోన్న జగన్ సర్కార్

పొద్దంతా పనిచేసి రాత్రికి ఒక క్వాటర్ తాగి గమ్మున పడుకునేవారు చాలా మంది ఉంటారు. కొందరు లొల్లి పెడుతారు. సరే పనిచేసిన అలిసిపోయిన వారి బాధను మద్యం తీరుస్తుంది. కానీ ఏపీలో మద్యం బాగా కాస్ట్.. మరి ఏం చేయాలి. పక్కరాష్ట్రం నుంచి వచ్చిన చీప్ మద్యంను కొని తాగేస్తున్నారు. ఏపీలో మద్యం ధరలు ఆకాశాన్ని అంటేలా ఉన్నాయి. దీంతో శానిటైజర్ కూడా తాగి చనిపోయిన మందుబాబులున్నారు. పక్కరాష్ట్రాల నుంచి మద్యం ను రానీయకుండా ఏపీ ప్రభుత్వం […]

Written By:
  • NARESH
  • , Updated On : September 8, 2020 / 09:14 PM IST
    Follow us on

    liquir shop

    పొద్దంతా పనిచేసి రాత్రికి ఒక క్వాటర్ తాగి గమ్మున పడుకునేవారు చాలా మంది ఉంటారు. కొందరు లొల్లి పెడుతారు. సరే పనిచేసిన అలిసిపోయిన వారి బాధను మద్యం తీరుస్తుంది. కానీ ఏపీలో మద్యం బాగా కాస్ట్.. మరి ఏం చేయాలి. పక్కరాష్ట్రం నుంచి వచ్చిన చీప్ మద్యంను కొని తాగేస్తున్నారు. ఏపీలో మద్యం ధరలు ఆకాశాన్ని అంటేలా ఉన్నాయి. దీంతో శానిటైజర్ కూడా తాగి చనిపోయిన మందుబాబులున్నారు. పక్కరాష్ట్రాల నుంచి మద్యం ను రానీయకుండా ఏపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో ఇప్పుడు ఆ దారులు మూసుకుపోయాయి.

    Also Read : జగన్ ను ఢీకొంటున్న ఒకే ఒక్కడు ఇతడు!

    ఇటీవల కొందరు హైకోర్టుకు ఎక్కడంతో ఇతర రాష్ట్రాల నుంచి 3 మద్యం బాటిళ్లు తెచ్చుకోవచ్చని న్యాయస్థానం తీర్పును ఇచ్చింది. అయితే ఈ 3 బాటిళ్లపై కూడా ఏపీ ఎక్సైజ్ శాఖ అభ్యంతరం తెలుపుతోంది. 3 బాటిల్స్ తెచ్చుకోవాలని తీర్పును సవాల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ ఎక్సైజ్ శాఖ సూచించింది. ఈ తీర్పును అడ్డుపెట్టుకొని మద్యం అక్రమ రవాణా పెరిగే ప్రమాదం ఉందని.. ఇతర రాష్ట్రాల నుంచి ఇష్టారీతిన మద్యం రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ తన నివేదికలో పేర్కొంది.

    ఇలా మందుబాబులను ఏపీ సర్కార్ వెంటాడుతోంది. రాష్ట్రంలో కొందామంటే భారీ రేట్లు. పైగా మంచి క్వాలిటీ మద్యం దొరకడం లేదు. పోనీ పక్కరాష్ట్రాల నుంచి 3 బాటిల్స్ చొప్పున తెంచుకుందామన్న ఒప్పుకోవడం లేదు. దానిపైన కూడా కోర్టుకెళుతోంది.

    ఇలా మందుబాబుల డబ్బులు గుంజడమే పనిగా పెట్టుకుందన్న విమర్శలు తాగుబోతుల నుంచి వినిపిస్తున్నాయి. ఆ మూడు బాటిల్స్ తో ఏపీలోకి భారీగానే అక్రమ రవాణా అవుతోందట.. మరి ఆ 3 బాటిల్స్ ను అయినా తెచ్చుకోనిస్తారా? లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఏపీ మద్యంప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    Also Read : బాబుకు షాక్.. అమరావతిపై జగన్ సీబీ‘ఐ’!