Homeఆంధ్రప్రదేశ్‌YS Sharmila: అన్నా ఇది తగునా.. జగన్‌ సర్కార్‌ను తప్పుపట్టిన షర్మిల!

YS Sharmila: అన్నా ఇది తగునా.. జగన్‌ సర్కార్‌ను తప్పుపట్టిన షర్మిల!

YS Sharmila: ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పుపై రచ్చ కొనసాగుతోంది. ఈ నిర్ణయంతో జగన్‌ సర్కాన్‌ అప్రదిష్టపాలవుతోంది. కేవలం తండ్రి పేరు పెట్టాలన్న కాంక్ష తప్ప ఎన్టీఆర్‌ యూనివర్సిటీ పేరు మార్చడానికి సరైన కారణం లేదని పలువురు విమర్శిస్తున్నారు. తండ్రి పేరు పెట్టుకోవాలంటే ఏదైనా ప్రాజెక్టు నిర్మించి పెట్టుకోవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో అంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి, వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌.షర్మిల తప్పు పట్టారు. వర్సిటీ పేరు మార్చడం సరైన నిర్ణయం కాదని.. పవిత్రత పోతుందని షర్మిల అన్నారు. ఒక్కోసారి ఒక్కో పేరు పెట్టుకుంటూ పోతే అర్ధం కాదన్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. టీడీపీ నేతలు మాత్రం తాము మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్‌ పేరు పెడతామని తేల్చి చెప్పారు. ప్రభుత్వం మాత్రం ఎన్ని విమర్శలు వచ్చినా ఈ విషయంలో తగ్గేది లేదు అంటోంది. అన్నీ ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అసెంబ్లీ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

YS Sharmila
YS Sharmila

తాజాగా ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీకి వైఎస్సార్‌ అని పేరు మార్చడంపై వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను మీడియా ప్రశ్నించగా.. ‘పేరు మార్చకూడదు.. దాని పవిత్రత పోతుంది అన్నారు. ఒక పేరు పెట్టారు.. ఆ పేరును తరతరాలు కంటిన్యూ చేస్తే వాళ్లకు గౌరవం ఇచ్చినట్లు’ అని అభిప్రాయపడ్డారు. ఒక్కోసారి ఒక్కో పేరు పెట్టుకుంటూ పోతే జనాలకు కూడా అర్థం కాదని.. కన్ఫ్యూజన్‌ పెరుగుతుందని చెప్పుకొచ్చారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

YS Sharmila
YS Sharmila

స్పందించిన తారక్‌..
హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పుపై తాజాగా సీనియర్‌ ఎన్టీఆర్‌ మనుమడు, యంగ్‌టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ స్పందించారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ పేరు మార్పుపై ట్విట్టర్‌ ద్వారా తన మనసులో మాట బయట పెట్టారు.. నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికు ఎమ్మెల్యే బాలయ్య, పురేందశ్వరి ఇతర కుటుంబ సభ్యులు స్పందించారు. వెంటనే ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ వివాదంపై తాజాగా జూనియర్‌ ఎన్టీఆర్‌ స్పందించారు. ‘‘ఎన్టీఆర్‌ , వైఎస్‌ఆర్‌ ఇద్దరూ ప్రజల్లో విశేష ఆదరణ ఉన్న వ్యక్తులే అని గుర్తు చేశారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి పేరు మార్చినంత మాత్రాన ఎన్టీఆర్‌ కీర్తి ప్రతిష్టలు ఏ మాత్రం దిగజారవు. ఒకరి పేరు తీసి మరొకరి పేరు పెట్టినంత మాత్రాన వారిస్థాయి పెరగదు. ఎన్టీఆర్‌ సంపాదించుకున్న పేరు, కీర్తి ప్రతిష్టలను చెరిపివేయడం సాధ్యం కాదు’’ అన్నారు. అయితే ఈ విషయంలోనూ ఎన్టీఆర్‌ పై విమర్శలు తప్పేలా లేవు. ఈ నిర్ణయంపై ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పు పడతారని టీడీపీ నేతలు, ఆయన అభిమానులు ఆశించారు. సోషల్‌ మీడియాలో పోస్టులు కూడా చేశారు. కానీ ఎన్టీఆర్‌ మాత్రం ఎప్పటిలానే.. కర్ర విరగదు.. పాము చావదు అన్న రీతిలో ట్వీట్‌ చేసి సరిపెట్టుకున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version