Ajith- Pawan Kalyan: తమిళ స్టార్ హీరో అజిత్ కాపీ కొట్టారు. పవన్ కళ్యాణ్ సినిమా పోస్టర్ ను యాజ్ టీజ్ దించేశాడు. తన కొత్త సినిమా ‘తునీవు’ పోస్టర్ చూస్తే అచ్చం పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన ‘వకీల్ సాబ్’ పోస్టర్ నే గుర్తుకు తెస్తోంది. హెచ్.వినోత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని జీ.స్టూడియోస్, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పై అప్పుడే పోలికలు చెబుతూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.

‘తునీవు’ పోస్టర్ లో పొడవాటి కుర్చీలో తెల్లగడ్డం, తెల్ల హెయిర్ తో స్టైలిష్ లుక్ లో అజిత్ కనిపిస్తున్నాడు. అజిత్ చేతిలో గన్ పట్టుకొని కళ్లు మూసుకొని ఆలోచిస్తున్నట్టుగా పోస్టర్ ఉంది. ఈ పోస్టర్ అచ్చం ‘వకీల్ సాబ్’ సినిమాలో పవన్ తన సామానుతో వ్యాన్ లో కూర్చొని బుక్ చదువుకున్న పోస్టర్ ను పోలి ఉంది. దీంతో పవన్ సినిమా నుంచి అజిత్ కాపీ కొట్టాడని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు.

పవన్ చేతిలో బుక్ ఉంటే.. అజిత్ చేతిలో గన్ ఉంది అంతే తేడా అని.. మిగతాదంతా సేమ్ టు సేమ్ అని అంటున్నారు. ఇలా పోస్టర్లు కాపీ కొట్టకుండా కొత్తగా ఆలోచించాలని హితవు పలుకుతున్నారు. వైరల్ చేస్తున్నారు.