https://oktelugu.com/

Theaters: థియేటర్లపై కొరఢా ఝళిపిస్తున్న ఏపీ సర్కార్.. అసలు టార్గెట్ ఏంటీ?

Theaters: ఏపీలోని థియేటర్లపై జగన్ సర్కార్ కొరడా ఝళిపిస్తోంది. ప్రభుత్వం వర్సెస్ సినీ పరిశ్రమ అన్నట్లుగా కొద్దిరోజులుగా  ఏపీలో రాజకీయాలు సాగుతున్నాయి. ఇందులో భాగంగానే జగన్ సర్కార్ సినిమా టికెట్ల రేట్లను తగ్గించడంతోపాటు బెన్ ఫిట్ షోలను పూర్తిగా రద్దు చేసింది. ఇందుకు సంబంధించిన జీవోలను ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు థియేటర్లలో అమలయ్యేలా ప్రభుత్వం పకడ్బంధీ చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం మరీ మొండిగా థియేటర్లపై దాడులకు దిగుతుండటంతో ఈ రంగంపై ఆధారపడిన వారంతా […]

Written By:
  • NARESH
  • , Updated On : December 22, 2021 / 04:02 PM IST
    Follow us on

    Theaters: ఏపీలోని థియేటర్లపై జగన్ సర్కార్ కొరడా ఝళిపిస్తోంది. ప్రభుత్వం వర్సెస్ సినీ పరిశ్రమ అన్నట్లుగా కొద్దిరోజులుగా  ఏపీలో రాజకీయాలు సాగుతున్నాయి. ఇందులో భాగంగానే జగన్ సర్కార్ సినిమా టికెట్ల రేట్లను తగ్గించడంతోపాటు బెన్ ఫిట్ షోలను పూర్తిగా రద్దు చేసింది. ఇందుకు సంబంధించిన జీవోలను ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు థియేటర్లలో అమలయ్యేలా ప్రభుత్వం పకడ్బంధీ చర్యలు తీసుకుంటోంది.

    Theaters

    ప్రభుత్వం మరీ మొండిగా థియేటర్లపై దాడులకు దిగుతుండటంతో ఈ రంగంపై ఆధారపడిన వారంతా కలవరానికి గురవుతున్నారు. కరోనా సమయంలో థియేటర్లలన్నీ దాదాపు ఎనిమిది నెలలు మూతపడ్డాయి. ఆ సమయంలో ప్రభుత్వం వీరిని ఆదుకున్న దాఖలాల్లేవు. అయితే ఇప్పుడు మాత్రం ప్రభుత్వం పదేపదే దాడులకు పాల్పడుతుండటంతో జగన్ సర్కార్ టార్గెట్ ఏంటీ అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

    కొద్దిరోజుల నుంచే కొత్త సినిమాలు థియేటర్ల బాటపడుతున్నాయి. ప్రేక్షకులు సైతం కరోనా ఆంక్షల మధ్యే థియేటర్ల వచ్చి సినిమా చూసేందుకు ధైర్యం చేస్తున్నారు. బాలకృష్ణ నటించిన ‘అఖండ’, అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఈ సినిమాలను చూసేందుకు అభిమానులు థియేటర్లకు వస్తుండటంతో మళ్లీ సందడి వాతావరణం నెలకొంది.

    ఇలాంటి సమయంలో ప్రభుత్వ అధికారులు, పోలీసులు తనిఖీల పేరుతో థియేటర్ల యాజమాన్యాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే వాదనలు విన్పిస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే పేరుతో థియేటర్లను సీజ్ చేయడం, నోటీసులు జారీ చేయడం, లైసెన్స్ రద్దు చేయడం వంటివి చేస్తున్నారు. దీంతో థియేటర్ల యాజమాన్యాలు, సిబ్బంది భయబ్రాంతులకు గురవుతోన్నారు.

    Also Read: శ్యామ్ సింగరాయ్ అద్భుతం.. స్టార్ హీరో కోసం మరో కథ సిద్ధం !
    మరోవైపు అభిమానులు సైతం పోలీసుల చర్యలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థియేటర్లలో తనిఖీలు చేపడుతున్న అధికారులు ఒక్క కృష్ణా జిల్లాలోనే 15థియేటర్లను సీజ్ చేయడం గమనార్హం. లైసెన్స్ లు లేకపోవడం, ఆన్ లైన్ టికెట్లు అమ్మకపోవడం, ఇతరత్ర కారణాలను అధికారులు చూపిస్తున్నారు. ప్రేక్షకులు చేస్తున్న ఫిర్యాదులను అధికారులు సీరియస్ గా తీసుకుని థియేటర్ల సీజ్ చేపడుతున్నట్లు తెలుస్తోంది.

    ప్రభుత్వ అధికారులు తీరు ఇప్పుడే ఇలా ఉంటే సంక్రాంతి సీజన్లో ఎలా ఉంటుందోననే ఆందోళనను థియేటర్ల యాజమనులు, డిస్ట్రిబ్యూటర్లు వ్యక్తం చేస్తున్నారు. ఈ సంక్రాంతికి ‘ఆర్ఆర్ఆర్’, ‘రాథేశ్యామ్’ వంటి పాన్ ఇండియా సినిమాలు విడుదల కానున్నాయి. ప్రభుత్వం తనిఖీలు, సీజ్ ల పేరుతో థియేటర్లను ఇబ్బందిపెడితే సినిమాలను ఎలా విడుదల చేయాలని డిస్ట్రిబ్యూటర్లు ఆవేదన చెందున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా వ్యవహరించి థియేటర్ల వ్యవస్థ దెబ్బతినకుండా చూడాలని వారంతా విజ్ఞప్తి చేస్తున్నారు.

    Also Read: ప్రేమలు మళ్లీ మళ్లీ విఫలమయ్యాయి కొత్త జీవితాన్ని ప్రారంభించిన హీరోయిన్స్ వీళ్ళే?