Senapathi: రాజేంద్ర ప్రసాద్ “సేనాపతి” వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే ?

Senapathi: తెలుగు ప్రేక్షకుల కోసం అల్లు అరవింద్​ తీసుకొచ్చిన సరికొత్త ప్లాట్​ఫామ్ ఆహా. తొలి తెలుగు ఓటీటీ సంస్థగా అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే తిరుగులేని గుర్తింపు పొందిన యాప్​ ఆహా. ఈ యాప్​ లాంచ్​ చేసిన కొద్దికాలంలోనే అత్యధిక డౌన్​లోడ్స్​తో రికార్డు సృష్టించింది. ఎప్పటికప్పుడు ప్రేక్షకుల టేస్టుకు తగ్గట్లు సినిమాలు రిలీజ్ చేస్తూ… సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ మంచి మంచి కంటెంట్​లను ఇస్తోంది ఆహా. ఇటు టాక్‌షోలు, అటు సినిమాలు, మరోవైపు వెబ్‌ సిరీస్‌లు.. […]

Written By: Raghava Rao Gara, Updated On : December 22, 2021 6:26 pm
Follow us on

Senapathi: తెలుగు ప్రేక్షకుల కోసం అల్లు అరవింద్​ తీసుకొచ్చిన సరికొత్త ప్లాట్​ఫామ్ ఆహా. తొలి తెలుగు ఓటీటీ సంస్థగా అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే తిరుగులేని గుర్తింపు పొందిన యాప్​ ఆహా. ఈ యాప్​ లాంచ్​ చేసిన కొద్దికాలంలోనే అత్యధిక డౌన్​లోడ్స్​తో రికార్డు సృష్టించింది. ఎప్పటికప్పుడు ప్రేక్షకుల టేస్టుకు తగ్గట్లు సినిమాలు రిలీజ్ చేస్తూ… సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ మంచి మంచి కంటెంట్​లను ఇస్తోంది ఆహా. ఇటు టాక్‌షోలు, అటు సినిమాలు, మరోవైపు వెబ్‌ సిరీస్‌లు.. ఇలా తెలుగు ప్రేక్షకులకు 100 శాతం వినోదాన్ని అందించేందుకు ప్రయత్నిస్తోంది ఆహా. ఈ క్రమంలోనే విభిన్న కథలతో కూడిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. ఇందులో భాగంగానే నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్‌ ప్రధాన పాత్రలో ‘సేనాపతి’ అనే వెబ్‌సిరీస్‌ను రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

Senapathi

Also Read: ఏపీలో కొనసాగుతున్న థియేటర్ల తనిఖీలు… కృష్ణా, విజయనగరం జిల్లాలో ఎన్ని సీజ్ చేశారంటే

రాజేంద్ర ప్రసాద్‌కు కూడా ఇదే మొదటి వెబ్‌సిరీస్‌ కావడం విశేషం. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ ఈ సిరీస్‌ను నిర్మించారు. గతంలో ‘ప్రేమ ఇష్క్ కాద‌ల్’ వంటి చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శకుడు ప‌వ‌న్ సాధినేని ఈ సిరీస్ ని డైరెక్ట్ చేస్తున్నారు. 2017లో తమిళంలో వచ్చిన సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘8 తొట్టక్కల్’ సినిమాకు తెలుగు రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘సేనాపతి’ పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. కాగా ఈనెల 31 నుంచి ఈ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా ‘వరల్డ్​ ఆఫ్ సేనాపతి’ పేరుతో సిరీస్ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఆద్యంతం యాక్షన్, సస్పెన్స్ ఎపిసోడ్స్‌తో ఉత్కంఠగా సాగింది ఈ ట్రైలర్. ఇక ఈ సినిమాలో న‌రేష్ అగ‌స్త్య, జ్ఞానేశ్వర్ కందేర్గుల‌, హ‌ర్షవ‌ర్దన్‌, రాకేందు మౌళి త‌దిత‌రులు ప్రధాన పాత్రల్లో నటించారు.

Also Read: శ్యామ్ సింగరాయ్ అద్భుతం.. స్టార్ హీరో కోసం మరో కథ సిద్ధం !