నారా లోకేష్ అరెస్ట్ కు రంగం సిద్ధం?

ఏపీలో పాలిస్తున్న వైఎస్ జగన్ సర్కార్ ప్రతీకారేచ్చతో రగిలిపోతోంది. ఇప్పటికే ఇద్దరినీ అరెస్ట్ చేసిన జగన్ సర్కార్ తాజాగా తమ నెక్ట్స్ టార్గెట్ ను ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ మెడకు ఉచ్చు బిగించేందుకు రంగం సిద్ధమైనట్టు ప్రచారం సాగుతోంది. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసి ఈ మేరకు వైసీపీ ప్రభుత్వం హెచ్చరికలు పంపిందా? ఇక త్వరలోనే లోకేష్ ను అరెస్ట్ చేయబోతున్నారని […]

Written By: NARESH, Updated On : June 16, 2020 3:15 pm
Follow us on


ఏపీలో పాలిస్తున్న వైఎస్ జగన్ సర్కార్ ప్రతీకారేచ్చతో రగిలిపోతోంది. ఇప్పటికే ఇద్దరినీ అరెస్ట్ చేసిన జగన్ సర్కార్ తాజాగా తమ నెక్ట్స్ టార్గెట్ ను ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ మెడకు ఉచ్చు బిగించేందుకు రంగం సిద్ధమైనట్టు ప్రచారం సాగుతోంది. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసి ఈ మేరకు వైసీపీ ప్రభుత్వం హెచ్చరికలు పంపిందా? ఇక త్వరలోనే లోకేష్ ను అరెస్ట్ చేయబోతున్నారని ప్రచారం ముమ్మరమైంది.. తాజాగా జరుగుతున్న పరిణామాలు అలానే జరుగుతున్నాయట.. ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి షాక్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం తాజాగా లోకేష్ ను టార్గెట్ చేసినట్టు ప్రచారం సాగుతోంది.

తనను చాలా ఇబ్బందులు పెట్టిన చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ను ఎలాగైనా సరే వారు చేసిన అక్రమాలను తవ్వితీసి జైలుకు పంపాలని సీఎం జగన్ కంకణం కట్టుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం గద్దెనెక్కగానే అమరావతి రాజధాని కుంభకోణంపై పడ్డారు. ఆ తర్వాత చంద్రబాబు పాలనలో అవినీతిని నిగ్గుతేల్చాలని కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మంత్రివర్గ ఉపసంఘం విచారణలో తాజాగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూశాయని తెలిసింది. మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాలోకేష్ కు అత్యంత సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ కేంద్రంగా ఈ అవినీతి సాగినట్టు సబ్ కమిటీ తేల్చింది.ఈ వేమూరి హరికృష్ణ గతంలో ఈవీఎంల ట్యాంపరింగ్, చోరీ కేసులో ప్రధాన నిందితుడు. ఇతడికి చెందిన బ్లాక్ లిస్ట్ లో ఉన్న టెరాసాఫ్ట్ కు గత చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఫైబర్ గ్రిడ్ పనులను కట్టబెట్టినట్టు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ విచారణలో తేలినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ముందుగా లోకేష్ పాత్ర కూడా సీబీఐ దర్యాప్తులో వెలుగుచూసే అవకాశం ఉందని తెలుస్తోంది. ముందుగా లోకేష్ ను అరెస్ట్ చేసి చంద్రబాబుకు గట్టి షాక్ ఇవ్వాలని.. ఆ తర్వాత చంద్రబాబు పని పట్టాలని వైసీపీ అధిష్టానం పక్కా ప్లాన్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

టీడీపీ సర్కార్ హయాంలో ముఖ్యంగా నారా లోకేష్ ఐటీశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో చేపట్టిన అతిపెద్ద పథకం ఫైబర్ గ్రిడ్. ఈ పథకంలో వందల కోట్ల అవినీతి జరిగినట్టు తాజాగా కేబినెట్ సబ్ కమిటీ నిర్ధారించినట్టు సమాచారం.

ఏపీ ప్రభుత్వం చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో 2015 జూలై 7న గత సర్కారు హయాంలో రూ.329 కోట్ల అంచనా వ్యయంతో ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ -ఆంధ్రపదేశ్‌ స్టేట్‌ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ టెండర్లలో నాలుగు సంస్థలు బిడ్‌లు దాఖలు చేశాయి. హారిజోన్‌ బ్రాడ్‌క్రాస్ట్‌ ఎల్‌ఎల్‌పీ, సిగ్నమ్‌ డిజిటల్‌ నెట్‌తో టెరాసాఫ్ట్‌ కన్సార్టియంగా ఏర్పడి రూ.320.88 కోట్లకు బిడ్‌ దాఖలు చేసింది.

అయితే ఇందులో తూర్పు గోదావరి జిల్లాలో ఈ–పాస్‌ యంత్రాల సరఫరాలో అక్రమాలకు పాల్పడిన టెరాసాఫ్ట్‌ను 2015 మే 11న ఏపీటీఎస్‌ (ఆంధ్రప్రదేశ్‌ టెక్నాలజీ సర్వీసెస్‌) బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టింది. బ్లాక్‌ లిస్ట్‌లో ఉన్న సంస్థకు టెండర్లలో బిడ్‌ దాఖలు చేసేందుకు అర్హత ఉండదు. కానీ ఈఎంవీ (ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌)ల చోరీ కేసులో నిందితుడు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన వేమూరు హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌ బిడ్‌ను ఆమోదించాలని టీడీపీ సర్కార్‌ పెద్దలు అధికారులపై ఒత్తిడి తెచ్చారని సబ్ కమిటీ నివేదించింది. అంతటితో ఆగకుండా తక్కువ ధరకు బిడ్‌ దాఖలు చేసిన ఎల్‌–1ను కాదని అధిక ధరకు బిడ్‌ దాఖలు చేసిన టెరాసాఫ్ట్‌కు ఫైబర్‌ గ్రిడ్‌ దక్కేలా చక్రం తిప్పినట్టు కేబినెట్ సబ్ కమిటీ విచారణలో తేలింది. ఈ క్రమంలో పైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టులో రూ.200 కోట్లకుపైగా అవినీతి చోటు చేసుకున్నట్లు నిర్ధారిస్తూ కేబినెట్‌కు నివేదిక ఇచ్చింది.

ఈ స్కాంలో ప్రధానంగా ఫైబర్ గ్రిడ్ లో నాటి మంత్రి లోకేష్ ను ముందుగా బుక్ చేయాలని వైసీపీ ప్రభుత్వం ధృడ నిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే లోకేష్ అడ్డంగా బుక్కైనట్టేనని వైసీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. త్వరలోనే లోకేష్ అరెస్ట్ తప్పదా అన్న చర్చ కూడా మొదలైంది. మరి ఎక్కడా దొరకని చంద్రబాబుకు ప్రస్తుతం లోకేష్ అరెస్ట్ తో జలక్ ఇవ్వాలని జగన్ నిర్ణయించారట.. ఈసారి సీఎం వైఎస్ జగన్ కు లోకేష్ దొరికేశాడని.. అతడి అరెస్ట్ ఖాయమన్న న్యూస్ వైరల్ అవుతోంది.