కబ్జాదారులకు షాక్ ఇవ్వబోతున్న జగన్ సర్కార్…?

ఏపీలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి జగన్ సర్కార్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, అవినీతి రహిత పాలనే లక్ష్యంగా ఏపీలో జగన్ సర్కార్ పాలన సాగుతోంది. తాజాగా జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కబ్జాదారుల తాట తీయడానికి సిద్ధమవుతోంది. మొదట ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపై జగన్ సర్కార్ దృష్టి పెట్టనుంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువైనప్పటికీ ప్రశాంతమైన […]

Written By: Navya, Updated On : September 13, 2020 10:28 am
Follow us on

ఏపీలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి జగన్ సర్కార్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, అవినీతి రహిత పాలనే లక్ష్యంగా ఏపీలో జగన్ సర్కార్ పాలన సాగుతోంది. తాజాగా జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కబ్జాదారుల తాట తీయడానికి సిద్ధమవుతోంది. మొదట ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపై జగన్ సర్కార్ దృష్టి పెట్టనుంది.

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువైనప్పటికీ ప్రశాంతమైన వాతావరణం ఉన్న జిల్లాగా విశాఖకు పేరుంది. అలాంటి విశాఖను జగన్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించారు. కోర్టుల్లో దాఖలైన పిటిషన్ల వల్ల విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అమలు ఆలస్యమైనా భవిష్యత్తులో ఏపీకి విశాఖనే రాజధానిగా ఉండబోతుంది. అయితే 2014 – 2019 మధ్య కాలంలో విశాఖలో జరిగిన భూ కబ్జాలు, భూ దందాలు అన్నీఇన్నీ కావు.

విశాఖలో భూ కబ్జాలు, భూ దందాల గురించి అప్పటి సీఎం చంద్రబాబు నాయుడుకు సైతం పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. చంద్రబాబు వాటి గురించి సిట్ విచారణకు ఆదేశించినా విచారణ ముందుకెళ్లకపోవడం గమనార్హం. నాటి ప్రభుత్వంలోని పెద్దలే తమ అనుచరులతో భూ కబ్జాలకు పాల్పడ్డారని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అయితే వైసీపీ తరపున రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖ భూముల ఆరోపణల గురించి స్పందించారు.

ప్రభుత్వ భూములను కాపాడటమే తమ సర్కార్ లక్ష్యమని…. భూ కబ్జాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా వదిలేది లేదని…. స్టేలు తెచ్చుకుని భూములను ఎంజాయ్ చేయాలనుకుంటే అది ఎప్పటికీ సాధ్యం కాదని అన్నారు. జగన్ సర్కార్ కొరడా ఝళిపించడానికి సిద్ధం కావడంతో భూ కబ్జాలకు పాల్పడిన వాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.