Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan- Jagan: మొత్తానికి పవన్‌ ఆందోళనపై స్పందించిన జగన్‌.. ఏమన్నాడో తెలుసా?

Pawan Kalyan- Jagan: మొత్తానికి పవన్‌ ఆందోళనపై స్పందించిన జగన్‌.. ఏమన్నాడో తెలుసా?

Pawan Kalyan- Jagan: వచ్చే ఎన్నికల్లో వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా దూకుడు పెంచిన జన సేనాని పవన్‌ కళ్యాణ్‌.. విశాఖ వేదికగా రెండు రోజులుగా చేస్తున్న మౌన పోరాటం.. ట్వీట్ల యుద్ధంతో ఏపీ సీఎం జగన్‌ దిగిరాక తప్పని పరిస్థితి వచ్చింది. రెండు రోజులుగా విశాఖ ఎపిసోడ్‌పై మౌనంగా ఉన్న జగన్‌.. జనసేనాని ఆందోళనతో తాజాగా నోరు విప్పారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని రైతుభరోసా నాలుగో ఏడాది రెండో విడత సాయాన్ని సోమవారం సీఎం జగన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా విశాఖలో జనసేనాని నిర్బంధం, ఆయన చేస్తున్న మౌనపోరాటంపై జగన్‌ స్పందించారు.

Pawan Kalyan- Jagan
Pawan Kalyan- Jagan

రైతుల ఖాతాలల్లో పెట్టుబడి..
వైఎస్సార్‌ రైతు భరోసా పథకంలో భాగంగా నాలుగేళ్లుగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఈ మేరకు నాలులగో ఏడాది రెండో విడత సాయంలో భాగంగా 50 లక్షల మంది రైతుల కాతాలల్లో రూ.13,500 చొప్పున జమ చేశారు. ఇప్పటికే ఒక్కో కుటుంబానికి రూ.51 వేలు అందించామని గుర్తు చేశారు. అలాగే రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వం లక్ష్మన్నారు. ఇప్పటివరకు ఒక్క వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారానే రూ.25,971.33 కోట్ల మేర రైతన్నలకు లబ్ధి చేకూరుతోంది అన్నారు. ఎన్నికల ముందు చెప్పిన దానికంటే మిన్నగా రైతన్నలకు తమ ప్రభుత్వం సాయాన్ని అందిస్తోంది అంటున్నారు.

కరువు మండలాలు లేని రాష్ట్రం..
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క కరువు మండలం కూడా ప్రకటించే అవసరం రాలేదన్నారు. ఈసారి కూడా సాధారణం కంటే ఎక్కువే వర్షపాతం నమోదైంది అన్నారు. దేవుడిదయ వల్ల కరువు మండలాలు ప్రకటించాల్సిన అవసరం రాలేదన్నారు. కానీ చంద్రబాబు నాయుడు, కరువు రెండూ కవల పిల్లల లాంటి వారని జగన్‌ అభిప్రాయపడ్డారు.

చంద్రబాబును సీఎం చేయడమే ఆయన లక్ష్యం..
ఇక విశాఖలో రెండు రోజులుగా జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ చేస్తున్న ఆందోళనపై కూడా సీఎం జగన్‌ స్పందించారు. పవన్‌ కళ్యాణ్‌ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును సీఎం చేయాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే బాబు దత్తపుత్రుడు అయిన పవన్‌ ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నాడని విమర్శించారు. ప్రజలు గమనించాలని కోరారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా సంక్షేమాన్ని వదిలేది లేదని స్పస్టం చేశారు జగన్‌. మీ ఆశీస్సులు ఉంటే మరిన్ని మంచి పనులు చేస్తానని తెలిపారు.

Pawan Kalyan- Jagan
Pawan Kalyan- Jagan

అన్ని బాగుంటే వ్యతిరేకత ఎందుకో..
రాష్ట్రం అంతా బాగుందని, అందరి సంక్షేమం కోసం తాను కృషి చేస్తున్నానని జగన్‌ చెప్పుకొచ్చారు. విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. సీఎం జగన్‌ చెప్పినట్లు రాష్ట్రంలో అన్నీ బాగుంటే ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని జనసేన నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఆడలేక మద్దెల ఓడు అననట్లుగా జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఏమీ చేయలేక విపక్షాలను విమర్శిస్తున్నారన్నారు. నాలుగేళ్ల పాలనలలో ఒక్క రోడ్డయినా వేశారా అని ప్రశ్నిస్తున్నారు. రైతులకు భరోసా అంటూ డబ్బులు ఇస్తున్న జగన్‌.. కౌలు రైతులు ఏం పాపం చేశారని పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. జనసేన కౌలు రైతుల సమస్యలపై ప్రశ్నిస్తే సర్కార్‌ సమాధానం చెప్పడం లేదని విమర్శించారు. కేవలం అధికారాన్ని ఎలా కాపాడుకోవాలన్న లక్ష్యంతోనే జగన్‌ డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తున్నారు.
గుణపాఠం తప్పదు..
2024 ఎన్నికల్లో జగన్‌ సర్కార్‌కు ఓటమి తప్పదని జనసేన నాయకులు పేర్కొంటున్నారు. డబ్బులు పంచి అంతా మంచిగా ఉందన్న భ్రమలో జగన్‌ ఉన్నారని విమర్శిస్తున్నారు. నాలుగేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్‌ విసురుతున్నారు. ఈ సవాల్‌ స్వీకరించని అధికార పార్టీ నేతలు కేవలం పవన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. విపక్షం చర్చకు పిలిస్తే అధికార పక్షం పారిపోవడమే ఓటమికి నిదర్శనమని జనసైనికులు పేర్కొంటున్నారు. జనమే వచ్చే ఎన్నికల్లో జగన్‌ సర్కార్‌కు గుణపాఠం చెబుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular