https://oktelugu.com/

AP 3 capitals: మళ్లీ 3 రాజధానుల బిల్లులు రెడీ చేస్తున్న జగన్.. ఆలోపే.. ఈసారి గట్టిగానే!

AP 3 capitals: ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల బిల్లులపై మరోసారి ఆసక్తికర చర్చ సాగుతోంది. గత నెలలో బిల్లులను రద్దు చేస్తూ ప్రకటించిన సీఎం జగన్ ఈసారి సరికొత్త తరహాలో రాజధాని బిల్లులను తీసుకొస్తామని ప్రకటించారు. అందులో భాగంగా రాజధాని బిల్లులను తయారు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సీఎం అధికారులను పరుగులు పెట్టిస్తున్నట్లు సమాచారం. స్వయంగా సీఎం జగన్ రంగంలోకి దిగి బిల్లుల తయారీపై దృష్టి సారిస్తున్నారు. అయితే ఈసారి బిల్లులను న్యాయపరమైన చిక్కులు లేకుండా […]

Written By:
  • NARESH
  • , Updated On : December 10, 2021 / 09:17 AM IST
    Follow us on

    AP 3 capitals: ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల బిల్లులపై మరోసారి ఆసక్తికర చర్చ సాగుతోంది. గత నెలలో బిల్లులను రద్దు చేస్తూ ప్రకటించిన సీఎం జగన్ ఈసారి సరికొత్త తరహాలో రాజధాని బిల్లులను తీసుకొస్తామని ప్రకటించారు. అందులో భాగంగా రాజధాని బిల్లులను తయారు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సీఎం అధికారులను పరుగులు పెట్టిస్తున్నట్లు సమాచారం. స్వయంగా సీఎం జగన్ రంగంలోకి దిగి బిల్లుల తయారీపై దృష్టి సారిస్తున్నారు. అయితే ఈసారి బిల్లులను న్యాయపరమైన చిక్కులు లేకుండా తయారు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఉభయ సభల్లోనూ బిల్లుల ఆమోదానికి అనువైన బలం ఉండడంతో ఈసారి ఆర్డినెన్స్ కూడా సులువుగా మారే అవకాశం ఉందని అంటున్నారు.

    AP CM YS Jagan Mohan Reddy

    ఏపీలోని మూడు ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా సీఎం జగన్ గతంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అమరావతి, విశాఖ, కర్నూలు జిల్లాల పేర్లను ఇందులో చేర్చారు. ప్రస్తుతం ఉన్న అమరావతితో పాటు మరో రెండు రాజధానులను ఏర్పాటు చేస్తామని 2018లో సీఎం ప్రకటించారు. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడంతో అక్కడికి కొన్ని కార్యాలయాలను తరలించారు. ఇక కర్నూలులో న్యాయపరమైన రాజధాని ఏర్పాటు కోసం హైకోర్టు ఏర్పాటుకు కసరత్తులు చేశారు.

    అయితే విలువైన తమ భూములను రాజధాని కోసం ఇచ్చామని, ఇప్పుడు తాము నష్టపోతామని అమరావతి రైతులు రాజధాని తరలింపుపై ఆందోళన చేస్తున్నారు. మూడు రాజధానుల ప్రకటన నుంచి ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఇటీవల 45 రోజుల పాటు పాదయాత్ర చేయాలని నిర్ణయించి అందుకోసం ముందుకు సాగుతున్నారు. మరోవైపు ప్రతిపక్ష టీడీపీతో పాటు కొన్ని పార్టీలు మూడు రాజధానుల ఏర్పాటుపై వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ముందుగా అమరావతి రాజధానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోని బీజేపీ సైతం రైతు పాదయాత్రలకు మద్దుతు ఇచ్చింది.

    ఇదిలా ఉండగా.. మూడు రాజధానుల ఏర్పాటు కోసం అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందింది. కానీ కోర్టు నుంచి న్యాయపరమైన చిక్కులు ఏర్పడ్డాయి. కోర్టులో ఏర్పడిన పిటిషన్లతో మూడు రాజధానుల ఏర్పాటుకు ఆటంకాలు ఏర్పడ్డాయి. మరోవైపు ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవల తిరుపతిలో పర్యటించినప్పుడు అమరావతి రాజధానికే మద్దతు ఇవ్వాలని తమ పార్టీ నాయకులకకు సూచించారు. దీంతో బీజేపీ నాయకులు సైతం అమరావతి రాజధానిగా ఉండాలని ఆందోళనలో పాల్గొన్నారు.

    ఈ నేపథ్యలో సీఎం జగన్ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం మార్చుకోలేదని, బిల్లు మాత్రమే రద్దు చేస్తున్నామని తెలిపారు.అంతేకాకుండా బిల్లులో మార్పులు తెచ్చి సరికొత్తగా తీసుకొస్తామని తెలిపారు. దీంతో మూడు రాజధానుల ఏర్పాటు కచ్చితంగా ఉంటుందని వైసీపీ నాయకులు సైతం అంటున్నారు.

    Also Read: మూడు రాజధానుల బాటలోనే.. జగన్ సర్కార్ మరో యూటర్న్
    ఇందులో భాగంగా సీఎం జగన్ ప్రధానంగా మూడు రాజధానుల ఏర్పాటులో తలమునకైనట్లు తెలుస్తోంది. అయితే ఈసారి బిల్లులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా దాదాపు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. జగన్ పదే పదే అధికారులను, న్యాయవాదులను అందుకు అనుగుణంగా బిల్లును తయారు చేయాలని సూచిస్తున్నారు. మూడు రాజధానుల ఏర్పాటు ఎంత ఆవశ్యకమో ప్రజలకు తెలిసే విధంగా బిల్లును తయారు చేయాలని సూచిస్తున్నారు.

    ఇక ఈ ఉగాదికి ముందే ఈ మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని సూచిస్తున్నారు. ఎందుకంటే మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. అంటే చివరి సంవత్సరం ఎన్నికల కోసం వెచ్చిస్తే మరో సంవత్సరం పాటు ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉంది. ఆ లోపు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని జగన్ చూస్తున్నారు.

    Also Read: ఏపీ భవిష్యత్ ప్రశ్నార్థకం.. రాష్ట్ర ప్రయోజనాలు వైసీపీకి అక్కర్లేదా?