Jagan: సానుభూతికి ఉన్న విలువ లెక్కగట్టలేనిది. ప్రజల్లో ఒకసారి సానుభూతి వస్తే దాన్ని ఎవరు కూడా తీసేయలేరు. ఇందులో భాగంగానే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ కు అధికారం సాధించి తెచ్చిపెట్టిందని తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో కత్తి దాడి జరిగిన సంగతి తెలిసిందే. దాన్ని టీడీపీ మాత్రం కొట్టిపారేసినా జగన్ కు మాత్రం ప్లస్ అయింది. జనంలో సానుభూతి పెరిగిపోయింది. ఫలితంగా అధికారం ఆయన సొంతమైంది.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో కూడా ఆయనపై అలిపిరిలో మావోల దాడి జరిగిది. దాని ద్వారా చంద్రబాబు లబ్ధిపొందాలని ముందస్తు ఎన్నికలకు వెళ్లినా అది సఫలం కాలేదు. ఫలితంగా కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారు. అయితే సానుభూతి విషయంలో కూడా ప్రజలు పలు విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. దీంతో సానుభూతి పవనాలతో అధికారం చేజిక్కించుకోవడం కూడా ఓ ప్రహసనంగా ఉంటుంది.
అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు కంట తడి పెట్టడం కూడా ఆయనకు ప్లస్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ ఇంకా ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నందున అంతవరకు ఆయన సానుభూతి ప్రజల్లో ఉంటుందా అనేదే ప్రశ్న. అప్పటిదాకా బాబు సానుభూతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుందని తెలుస్తోంది. నేపథ్యంలో చంద్రబాబు ఏ మేరకు ఫలితం అందుకుంటారో వేచి చూడాల్సిందేనని చెబుతున్నారు.
Also Read: KCR Jagan: కలిసిన కేసీఆర్, జగన్..చంద్రబాబు సింపతిపై కీలక సమాలోచనలు?
ప్రజల్లో సానుభూతి పెరిగితే చాలు విజయం అదే వస్తుంది. సెంటిమెంట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలోనే నేతలు జాగ్రత్తగా ఉండాలి. రాజకీయంగా లబ్ధి పొందేందుకు తీసుకోవాల్సిన విధానాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిందే. రాబోయే ఎన్నికల్లో జగన్, చంద్రబాబు ప్రజల నుంచి ఏ మేరకు సానుభూతి పవనాలు తమ వైపు వీచేందుకు ఏ ప్రణాళికలు వేస్తారో వేచి చూడాల్సిందే.
Also Read: Chandrababu: చంద్రబాబు పరువు ఎవరు తీస్తున్నారు..?