గత కొన్నేళ్లలో వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉండగా ఆయనపై ఎన్నో కేసులు నమోదయ్యాయి. గత చంద్రబాబు ప్రభుత్వంలో అయితే మరెన్నో కేసులు పెట్టారు. వాటన్నింటిని ఎదుర్కొన్న జగన్ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. తన చేతిలో అధికారం ఉంది. దీంతో ఇప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చుక్కులు చూపిస్తున్నారు.
నాడు జగన్ పై కేసులను పండుగ చేసుకున్న టీడీపీ శ్రేణులు ఇప్పుడు మాత్రం తీవ్రంగా తప్పు పడుతున్నారు.ప్రభుత్వం చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని ఆరోపిస్తున్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా పోరాడాతామంటున్నారు.
ఇటీవల ఏపీలో కొత్తరకం కరోనా వేరియంట్ వచ్చిందని చంద్రబాబు చేసిన కామెంట్లపై కర్నూలు జిల్లాలో కేసు నమోదైంది. అది మరువక ముందే తాజాగా మరో కేసు గుంటూరులో నమోదైంది. గుంటూరు జిల్లా అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైంది. కరోనాపై చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను భయ బ్రాంతులకు గురిచేస్తున్నారంటూ న్యాయవాది పచ్చల అనిల్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కరోనా పట్ల ప్రజలు భయపడేలా చంద్రబాబు, టీడీపీ నేతలు మాట్లాడారని అనిల్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇలా చంద్రబాబు నోరు తెరిస్తే చాలు కేసులతో అధికార పార్టీ ఉచ్చు బిగుస్తోంది. అయితే చంద్రబాబు కోర్టుకెక్కి వీటిపై స్టేలు తెచ్చుకోవడం కామన్ గా మారింది.