సరైన నిద్ర వల్ల అనేక రోగాలకు చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. మనం తీసుకునే ఆహారం సైతం నిద్రపై ప్రభావం చూపుతుంది. ఎవరైతే నిద్రలేమితో బాధ పడుతూ ఉంటారో వాళ్లు పిస్తా తినాలని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. రోజూ రాత్రి సమయంలో పిస్తాను తీసుకుంటే మంచిది. పిస్తాలో మెలటోనిన్ పుష్కలంగా ఉంటుంది. మెలటోనిన్ నిద్ర ఉపక్రమనకు ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మెదడులోని పీయూష గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యే మెలటోనిన్ నిద్ర, మెలకువలను నియంత్రిస్తుంది. రాత్రి సమయంలో మెలటోనిన్ ఎక్కువవుతుంది కాబట్టి రాత్రి సమయంలో మనకు నిద్ర వస్తుంది. తీవ్ర నిద్రలేమి సమస్యతో బాధ పడేవాళ్లకు వైద్యులు మెలటోనిన్ హార్మోన్‌ను కృత్రిమంగా అందించడం జరుగుతుంది.
అయితే కృత్తిమంగా మెలటోనిన్ హార్మోన్ ను ఉత్పత్తి చేసుకునే బదులు పిస్తా తీసుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతుండటం గమనార్హం. పిస్తా తీసుకున్నా నిద్రలేమి సమస్య తీసుకోకపోతే వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవాలి.