అధికారంలోకి వచ్చాక ఏదీ లేట్ చేయకుండా అన్నింటిని వేగంగా భర్తీ చేస్తున్నారు ఏపీ సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఒకసారి నామినేటెడ్ పోస్టులను భారీగా భర్తీ చేసిన జగన్ తాజాగా ప్రభుత్వ సంస్థల్లోని నామినేటెడ్ పోస్టులను ప్రకటించారు. దాదాపు 135 కార్పొరేషన్లు, సంస్థల్లో చైర్మన్లను, డైరెక్టర్లను నియమించారు.
ఏపీ సీఎం జగన్ నామినేటెడ్ భర్తీలోనూ సామాజిక న్యాయం పాటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఏకంగా 76 పదవులు కేటాయించారు. బీసీలకు ఇందులో 56శాతం పదవులు కేటాయించిడం విశేషం. ఇక 50 శాతం పదవులు ఇందులో మహిళలకే ఇవ్వడం సంచలనంగా మారింది.
ముఖ్యమైన పదవులను పార్టీ కోసం 10 ఏళ్లు కష్టపడ్డ వారికే ఇచ్చారు. ఇక ఎమ్మెల్యే పదవులను త్యాగం చేసిన వారికి.. వైసీపీ తరుఫున పోటీచేసి ఓడిపోయిన వారికి కేటాయించారు.