Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan : మంత్రులకు ఝలక్ ఇచ్చిన జగన్.. ఇద్దరు.. ముగ్గురు ఔట్..?

CM Jagan : మంత్రులకు ఝలక్ ఇచ్చిన జగన్.. ఇద్దరు.. ముగ్గురు ఔట్..?

CM Jagan : రాష్ట్ర మంత్రివర్గంలో మరోసారి మార్పులు చోటుచేసుకున్నాయా..? ఎన్నికలకు ఏడాది ముందు తన కొత్త టీం ను సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేసుకోబోతున్నారా..? మంగళవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఆయన ఈ మేరకు సంకేతాలు ఇచ్చారా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది.

‘ఈసారి మరో రెండు మూడు టికెట్లు ఎగిరిపోతాయి పనితీరు మదింపు చేసి దాని ఆధారంగా టికెట్లు ఇస్తాం’ అని మంత్రులు సీఎం జగన్మోహన్ రెడ్డి హెచ్చరిక జారీ చేశారు. ‘మీ పనితీరును మెరుగుపరుచుకోవాలి అసెంబ్లీలో మంత్రులు అందరూ దూకుడుగా వ్యవహరించాలి చర్చల్లో చిరుగా స్పందించాలి ప్రతి ఒక్కరు పని తీరుపై ఆడిట్ ఉంటుంది’ అని సీఎం జగన్ మోహన్ రెడ్డి మంత్రులకు స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈమెకు సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్లు చెబుతున్నారు. ఎటువంటి సందర్భం లేకుండానే ముఖ్యమంత్రి అనూహ్యంగా ఈ అంశాన్ని ప్రస్తావించడంతో మంత్రులు అవాక్కైనట్లు చెబుతున్నారు.

-ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం..

రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల కింద జరిగిన పట్టభద్రులు, ఉపాధ్యాయ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అంశాన్ని సీఎం ప్రస్తావిస్తూ.. నిన్నటి వరకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు బాగానే పనిచేసినట్లు నివేదికలు అందాయన్నారు. ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యత కూడా మంత్రులదేనని, పోలింగ్ సమయంలో పార్టీ అభ్యర్థులకు సక్రమంగా ఓట్లు వేసేలా ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు. 21, 22 తేదీల్లో అసెంబ్లీకి ఉగాది సందర్భంగా సెలవు ఇవ్వడంతో 23న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరయ్యాలా చూడాలని మంత్రులకు సీఎం ఆదేశించారు. ఎవరైనా రాకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇబ్బంది అవుతుందని, అందువల్ల అందరూ వచ్చేలా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులుదేనని గట్టిగా చెప్పినట్లు సమాచారం. ఈనెల 25 నుంచి వారం రోజులపాటు ఆసరా వారోత్సవాలను ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఆధ్వర్యంలో నిర్వహించాలని ఆదేశించారు.

విశాఖకు జూలైలో..

ఇక విశాఖపట్నం రాజధానిగా పాలన సాగించాలని భావిస్తున్న వైసిపి ప్రభుత్వం.. ఆ దిశగాను అడుగులు ముందుకు వేస్తుంది. మంత్రివర్గ సమావేశంలో దీనిపైన కూడా సీఎం మాట్లాడినట్లు చెబుతున్నారు. విశాఖపట్నానికి జూలైలో వెళ్తున్నామని, అప్పటికల్లా అన్ని కుదురుకుంటాయని మంత్రులతో సీఎం జగన్ వ్యాఖ్యానించారు. విశాఖలో ఇటీవల నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు విజయవంతమైన సీఎం అభినందిస్తూ మంత్రివర్గ సభ్యులు తీర్మానం చేసిన సందర్భంగా స్పందిస్తూ సీఎం పై వ్యాఖ్యలు చేశారు. సమావేశం చివరిలో మంత్రి దాడిశెట్టి రాజా కల్పించుకుంటూ ఎమ్మెల్యేలకు ఇళ్ల స్థలాలు విషయాన్ని ప్రస్తావించగా విశాఖలో ఇద్దాం అని సీఎం చెప్పినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు, ఐఏఎస్ లకు, న్యాయమూర్తులకు విశాఖలో ఇళ్ల స్థలాలు ఇస్తామని, పెట్టుబడిదారులు ఎవరైనా వచ్చే అక్కడ ఉంటామంటే వారికి స్థలాలు ఇస్తామని సీఎం చెప్పినట్లు తెలిసింది. రవాణా శాఖలో రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించి 15 లక్షల కార్డులు పంపిణీ ఆగిపోయిందని, రూ. 30 కోట్లు మంజూరు చేస్తే వాటిని పంపిణీ చేయగలమని రవాణా శాఖ మంత్రి విశ్వరూప్ సిఎం దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిసింది. రూ. 30 కోట్ల అయితే పెద్ద విషయమేమీ కాదు కదా చేయండి అని సీఎం అనగానే, సాంకేతిక కారణాలను సీఎస్ జవహర్ రెడ్డి ఏదో చెప్పబోగా,  ‘చేసేయండి విశ్వరూపం సమన్వయం చేస్తారని సీఎం చెప్పినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు సర్వత్ర చర్చనీయాంశంగా మారాయి.

Exit mobile version