
స్వపక్షంలో ఉండి.. స్వపక్షంపైనే విమర్శలు చేస్తే ఎలా ఉంటుందో ఆ నేతలకు ఏపీ సీఎం జగన్ రుచి చూపిస్తున్నారు. వైసీపీ నుంచి గెలిచి.. ఆ పార్టీ నేతలు, ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు జగన్ అనూహ్యంగా షాక్ ఇచ్చారు. ఆయన కోరిన ఓ కీలక సమావేశానికే ఆయన్ను దూరం పెట్టారు. మిగతా ఎంపీలతో ఆ భేటీ నిర్వహించడం, రఘురామ రాజుకు ఆహ్వానం అందలేదు.
Also Read : బాబుకు వయసు బెంగ పట్టుకుందట..?
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగా.. ఆ సమావేశాల్లో పార్టీ ఎంపీలు ఎలా నడుచుకోవాలి, ఎలా వ్యూహాత్మకంగా మలచుకోవాలో పార్టీ అధినాయకత్వం ముందస్తు భేటీలు నిర్వహిస్తుంటుంది. ఈ భేటీలు పార్టీ ఎంపీలకు ఓ గౌరవం కూడా. ఈ భేటీ ద్వారా ఎంపీలకు పార్టీ ఇస్తున్న గౌరవం కూడా తెలుస్తుంది. కానీ.. వైసీపీ నిర్వహించిన ఈ భేటీకి వైసీపీ రెబల్ ఎంపీ అయిన రఘురామరాజును ఆహ్వానించలేదు.
‘పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సమావేశాల్లో ఎలాంటి వ్యవహరించాలి’ చెబుతూ పార్టీ ఎంపీలతో భేటీ నిర్వహించాలని ఇటీవలే రఘురామరాజు సీఎం జగన్‌కు లేఖ రాశారు. ప్రత్యేక హోదాతోపాటు పెండింగ్ సమస్యలు చాలానే ఉన్నాయని, అఖిలపక్ష భేటీ నిర్వహించడం ద్వారా ఎంపీలకు దిశానిర్దేశం చేయాలని కోరారు.
స్వయంగా రఘురామరాజు కోరినట్లే జగన్ వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. కానీ.. దీనికి రఘురామరాజు పాల్గొనకుండా చేశారు. ఎలాంటి ఆహ్వానం అందకపోవడంతో ఆయన కూడా భేటీకి దూరంగా ఉండిపోయారు. ఈ మీటింగ్‌కు హాజరుకాకుండా పార్లమెంట్ సమావేశాలకు బయల్దేరి వెళ్లారు.
Also Read : బీజేపీకి వైసీపీ పాహిమాం.. ఎదురించుట లేదు