కరోనా కల్లోలం మీద ప్రజల్లో మెల్లమెల్లగా భయాలు తొలుగుతున్నాయి. లాక్‌డౌన్‌తో ఎక్కడికక్కడ స్తంభించిపోయిన జనం అన్‌లాక్‌తో అన్నీ తెరుచుకోవడంతో ఇప్పుడిప్పుడే రోడ్లపైకి వస్తున్నారు. అయితే.. లాక్‌డౌన్‌తో థియేటర్లు, రెస్టారెంట్లు, బార్లు తదితర వాటన్నింటినీ మూసివేసిన కేంద్రం ఈ మధ్యే రెస్టారెంట్లు, బార్లకు పర్మిషన్ ఇచ్చింది. ఇంకా థియేటర్లు తెరుచుకోలేదు. కానీ షూటింగ్‌లకు మాత్రం అనుమతి లభించింది.
Also Read : వారితో గడిపి ఎంతో అనుభూతి చెందాను – రేణూ దేశాయ్
దీంతో ఇప్పటికే రన్నింగ్‌లో ఉన్న సినిమాలకు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు షెడ్యూల్స్ రెడీ చేస్తున్నారు. ఇంకా చాలా చోట్ల లోకేషన్లలో ఆయా ప్రభుత్వాలు పర్మిషన్ ఇవ్వడం లేదు. దీంతో కొత్త లొకేషన్లను వెతుకుతున్నారు. ఫారిన్ కంట్రీస్‌కు వెళ్లి ఇప్పట్లో షూటింగ్‌లు చేసే పరిస్థితి కూడా లేకపోవడంతో మాగ్జిమమ్ స్వదేశంలోనే షూటింగ్‌లు కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఇక సంక్రాంతి టార్గెట్‌గా రిలీజ్ కావాలనుకుంటున్న పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ కూడా షెడ్యూలుకు రెడీ అవుతోందట. ఈ నెల 23 నుంచి సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం సుమారు అటు ఇటుగా 30 రోజుల షూటింగే ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో పవన్ వర్క్ 15 రోజులేనట.
షెడ్యూల్‌లో భాగంగా ముందుగా పవన్ లేని వర్క్ పూర్తిచేయడమా..? లేక వీలును బట్టి సీన్లు షూట్ చేయడమా..? అనే డిస్కస్ నడుస్తున్నట్లు టాక్. ఈ మేరకు పవన్‌తో డిస్కషన్లు, ఫైనల్ డెసిషన్లు కూడా అయిపోయినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే చకచకా అక్టోబర్ చివరి నాటికి టోటల్ షూట్ పార్ట్ పూర్తయిపోతుంది. సంక్రాంతి బరిలో నిలిచే ఛాన్స్ ఉంది.
Also Read : మెగా బ్రదర్ నాగబాబుకు కరోనా సోకిందా?