Vangaveeti Radhakrishna- Jagan: వంగవీటి… ఏపీ రాజకీయాల్లోఈ పేరుకు ఒక వైబ్రేషన్ ఉంది. వంగవీటి మోహన్ రంగా చనిపోయి దశాబ్దాలు దాటుతున్నా ఆయన పేరు మాత్రం అజరామరం. అయితే మోహన్ రంగా వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కుమారుడు రాధాక్రిష్ణ ను జగన్ దారుణంగా వంచించారు. వ్యక్తిగత ఇమేజ్ కలిగిన నాయకులంటే ఆయనకు గిట్టదు. ఈ క్రమంలోనే ఆయన రాధాక్రిష్ణను దూరం చేసుకున్నారు. కాదు పొమ్మన లేక పొగపెట్టారు. వైసీపీ ఆవిర్భావం తరువాత ఆ పార్టీలో చేరిన రాధాక్రిష్ణ పార్టీ బలోపేతం పై ఫోకస్ పెట్టారు. ఎన్ని కష్టాలు ఎదురైనా జగన్ వెంటే నడిచారు. కానీ విపరీత మనస్తత్వం కలిగిన జగన్ వంగవీటి కుటుంబం ముద్రను చేరిపేయ్యాలనే ప్రయత్నం చేశారు. అందుకే రాధాక్రిష్ణను విజయవాడ రాజకీయాల నుంచి దూరం పెట్టాలని భావించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి తప్పించాలని చూశారు. అందుకే ఎప్పటి నుంచో పనిచేస్తూ వస్తున్న రాధాను కాదని..మల్లాది విష్ణును తెరపైకి తెచ్చారు.

విజయవాడ అంటే ముందుగా గుర్తొచ్చేది వంగవీటి ఫ్యామిలీ. కానీ రాజకీయ తప్పుడు నిర్ణయాలతో వంగవీటి ఫ్యామిలీ పవర్ పాలిటిక్స్ కు దూరమైంది. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పక్షాలు ఆడిన డ్రామాలో వంగవీటి కుటుంబం సమిధగా మారిపోయింది. విజయవాడ పవర్ పాలిటిక్స్ కు దూరం చేయడంలో పార్టీలు సక్సెస్ అయ్యాయి. అయితే జగన్ మాత్రం వంగవీటి కుటుంబానికి దారుణంగా వంచించారు. కష్టకాలంలో తన వెంట నడిచారన్న కనీస బాధ్యత లేకుండా గత ఎన్నికల ముందు మల్లాది విష్ణుకు పార్టీలోకి రప్పించి మరీ టిక్కెట్ కేటాయించారు. స్వతహాగా దూకుడు స్వభావం కలిగిన రాధా తాను ఎవరి దయపై తాను ఆధారపడనని.. తనకు ప్రజాబలం ఉందంటూ బయటకు వచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీలో చేరారు.
అయితే హైకమాండ్ ఆడిన వికృత క్రీడలో రాధాను బలిచేశారని వైసీపీలోని వంగవీటి సన్నిహితులు, రాధా స్నేహితులు బాధపడిన సందర్భాలున్నాయి. వంగవీటి కుటుంబాన్ని విభేదిస్తే రాజకీయంగా తమకు ఇబ్బందులు వస్తాయని తెలిసి చాలా మంది అధికార పార్టీ నాయకులు రాధాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఇప్పుడు రాధా జనసేనలో చేరుతారన్న వార్త అధికార పార్టీ నాయకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అటు టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తాయన్న వార్తల నేపథ్యంలో వంగవీటి కుటుంబానకి పూర్వ వైభవం రావడం ఖాయమని తెలియడంతో చాలా మంది వెన్నులో వణుకు పుడుతోంది.

ఆ మధ్యన రాధా హత్యకు రెక్కీ చేశారన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. అటు జగన్ సర్కారు సెక్యూరిటీని సైతం రాధా తిరస్కరించారు. తాను కొనసాగుతున్న టీడీపీలో ఏమంత కంఫర్టుగా లేకపోయినా.. వైసీపీతో పోలిస్తే స్వేచ్ఛ ఉందని రాధాతో పాటు అనుచరులు భావిస్తున్నారు. ఇదే సానుకూల వాతవరణం కొనసాగి టీడీపీ, జనసేనలు కలిసి పోటీచేస్తే మాత్రం విజయవాడ కేంద్రంగా రాధా చక్రం తప్పే అవకాశముంది. తనను పొమ్మన లేక పొగపెట్టి.. తనకు రాజకీయంగా గడ్డు రోజులు వచ్చేలా చేసిన జగన్ పై రివేంజ్ తీర్చుకునే రోజులు దగ్గర్లో ఉన్నాయని రాధా భావిస్తున్నట్టు సమాచారం.