CM Jagan: జగన్ ను నడిపించేది వారేనట..

CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అంత తేలిగ్గా ఎవరిని నమ్మరని తెలిసిందే. ఆయన పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటూ తన పనితనాన్ని మెరుగుపరుచుకుంటుంటారు. ఇందులో భాగంగానే సంక్షేమ పథకాల అమలును వేగవంతం చేస్తున్నారు. దీని కోసం పటిష్ట యంత్రాంగాన్ని నియమించుకున్నట్లు తెలుస్తోంది. దీంతోనే ప్రతిసారి జరిగే ఎన్నికల్లో ఆయన సునాయాసంగా విజయం సాధిస్తున్నట్లు సమాచారం. ఇంటలిజెన్స్, సర్వే అధికారుల నివేదికలు నమ్మకుండా తన సొంత బృందంతోనే సర్వేలు చేయించుకుని ఎప్పటికప్పుడు తన తీరును మార్చుకుంటూ ఉంటారు. […]

Written By: Srinivas, Updated On : December 1, 2021 1:25 pm
Follow us on

CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అంత తేలిగ్గా ఎవరిని నమ్మరని తెలిసిందే. ఆయన పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటూ తన పనితనాన్ని మెరుగుపరుచుకుంటుంటారు. ఇందులో భాగంగానే సంక్షేమ పథకాల అమలును వేగవంతం చేస్తున్నారు. దీని కోసం పటిష్ట యంత్రాంగాన్ని నియమించుకున్నట్లు తెలుస్తోంది. దీంతోనే ప్రతిసారి జరిగే ఎన్నికల్లో ఆయన సునాయాసంగా విజయం సాధిస్తున్నట్లు సమాచారం.

ఇంటలిజెన్స్, సర్వే అధికారుల నివేదికలు నమ్మకుండా తన సొంత బృందంతోనే సర్వేలు చేయించుకుని ఎప్పటికప్పుడు తన తీరును మార్చుకుంటూ ఉంటారు. దీని కోసమే ఐదు మార్గాల ద్వారా సర్వే చేయించుకుని ప్రజలు ఏమనుకుంటున్నారో అనే దానిపై ఓ క్లారిటీకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం తన నిర్ణయాలను అమలు చేసేందుకు ఒక బృందాన్ని ఉంచుకున్నట్లు సమాచారం.

దీంతోనే రాష్ర్టంలో వైసీపీ అప్రతిహ విజయాలు సొంతం చేసుకుంటోంది. సంక్షేమ పథకాల అమలుతో ప్రజల్లో మంచి అభిప్రాయం తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ నేతలు కూడా పనితీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు. సర్వే నివేదికల ఆధారంగా తమ ప్రభుత్వ తీరును మెరుగుపరుచుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటారు.

Also Read: Caste Based Politics: ఇద్దరు వైసీపీ కమ్మ నాయకులపై 50 లక్షల రివార్డ్ ప్రకటించిన ఒక కమ్మ వ్యక్తి

ప్రజల్లో వస్తున్న మార్పులను గమనిస్తూ తమ పద్ధతులు మార్చుకుంటున్నారు. ప్రజలను తక్కువగా అంచనా వేయొద్దని సూచనలు చేస్తున్నారు. విజయాలను చూస్తూ పొంగిపోవద్దు. ప్రజల్లో ఆగ్రహం ఒక్క రోజులో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే నేతలు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. రాబోయే ఎన్నికలకు తమను తాము మార్చుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Also Read: Sharmila: ‘ప్రజా ప్రస్థానం’తో షర్మిల తెలంగాణలో ఎంత మేర సక్సెస్ అయ్యారు..?

Tags