Kangana Ranaut: ఎప్పుడు సోషల్ మీడియాలో తన పోస్టులతో ఇంకొకర్ని విమర్శిస్తూ నిత్యం నెటిజన్స్ నోట్లో వినిపించే పేరు బాలీవుడ్ విమర్శల బ్యూటీ కంగనా రనౌత్. అయితే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన పోస్ట్ ను పెట్టారు ఈ భామ. పంజాబ్‌లోని బటిందాకు చెందిన ఒక వ్యక్తి తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని, సంబంధిత ఎఫ్‌ఐఆర్ ప్రతిని కంగన తన ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.
bollywood actress kangana ranaut sensational post on threatenings
అయితే ఈ అమ్మడు పంజాబీ రైతులు సాగు చట్టాల రద్దుకు చేస్తున్న ఉద్యమంపై సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించిన తన అభిప్రాయాలను కొందరు తీవ్రంగా వ్యతిరేకించి,తనని బెదిరిస్తున్నారని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మంగళవారం వెల్లడించారు.అయితే పంజాబ్ కు చెందిన వ్యక్తి తనని చంపుతాను అని బెదిరిస్తున్నాడని ఈ తరహా హెచ్చరికలు ఎక్కువైపోయాయని, పంజాబ్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.
Also Read: “రాధేశ్యామ్” నుంచి హిందీ లో రెండో పాట రిలీజ్… కెమిస్ట్రీతో అదరగొట్టిన ప్రభాస్, పూజా
ఆమె ఫిర్యాదు చేసిన ఎఫ్‌ఐఆర్ అక్కడి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకో లేదేమో అక్కడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ….దేశానికి ద్రోహం చేసే వారికి వ్యతిరేకంగా మాట్లాడతా. అమాయక జవాన్లను చంపేసే నక్సలైట్లనూ వ్యతిరేకిస్తా, తుక్డే తుక్డే గ్యాంగ్‌లనూ విమర్శిస్తా అని కంగనా అన్నారు. అయితే ఇలాంటి బెదిరింపులకు నేను భయపడను. నన్ను చంపేస్తానని ఓ వ్యక్తి పంజాబ్‌లో బహిరంగంగా ప్రకటించాడు అని కంగనా పోస్ట్ చేశారు. “సోనియా గాంధీజీ మీరూ ఒక మహిళే. మీ అత్తగారు ఇందిర గాంధీ ఇదే ఉగ్రవాదులపై తుదిశ్వాస వరకూ పోరాడారు” నన్ను బెదిరిస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పంజాబ్ లోని మీ ప్రభుత్వ ముఖ్యమంత్రికి తెలపండి” అని కంగనా తన పోస్ట్ ద్వారా విజ్ఞప్తి తెలియజేశారు.