Jagan- Minister Roja: పార్టీలో వ్యతిరేకించినా.. జబర్ధస్త్ సహా సినిమాల్లో ఆమె నర్తిస్తోందని అన్నా కూడా సీఎం జగన్ తాను ఇచ్చిన హామీ మేరకు ఆర్కే రోజాకు మంత్రి పదవి కేటాయించాడు. అంతేకాదు.. ఆమె చిరకాల కోరిక తీర్చాడు. పార్టీలోని సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి వ్యతిరేకించినా కూడా ఇచ్చిన మాట కోసం రోజాకు మంత్రి పదవి ఇచ్చి జగన్ సంతృప్తి పరిచాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే రోజా పనితీరుపై జగన్ ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం.

రోజా మంత్రిత్వశాఖ కంటే గుడులు, గోపురాలు.. సెలబ్రెటీలను కలిసి సొంతంగా ఫోకస్ అవుతోందని.. పార్టీ, జగన్ కంటే కూడా సొంత ఎజెండాతో వెళుతోందని జగన్ సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు ఆమె మంత్రి పదవికి ఎసరు పెడుతున్నట్టు ప్రచారం సాగుతోంది.
Also Read: Sixth Ocean On Earth: భూమ్మీద ఆరో మహాసముద్రం: ఇంతకీ దీనిని ఎక్కడ కనుగొన్నారో తెలుసా?
మంత్రి అయిన తర్వాత రోజా జగన్ వ్యతిరేకులను కలుస్తోందని సమాచారం. తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఇంటికెళ్లి కలవడం.. ఇక ఇటీవల కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం మొగల్తూరు వెళ్లి హల్ చల్ చేసింది. జగన్, పార్టీ ఆదేశాలు లేకుండా సొంతంగా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని సొంత పరపతి సంపాదించుకుంటోందని రోజాపై జగన్ సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది..
జగన్ తర్వాత వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతల్లో రోజా ఒకరు. ఆమెకు తొలి రెండున్నరేళ్లలో మంత్రి పదవి ఇద్దామనుకున్నా సామాజిక సమీకరణాల్లో కుదరలేదు. ఈసారి ఇస్తే రోజా వ్యవహార శైలి చూసి పార్టీకి తలవొంపులు వస్తున్నాయని అంటున్నారు. చేయకూడని పనులన్నీ చేస్తూ రోజా పార్టీకి మైనస్ గా మారుతోందని అంటున్నారు.

ఇక మంత్రిగా ప్రజాజీవితంలో ఉన్నాక బుల్లితెర షోలు, జబర్ధస్త్ కు దూరంగా ఉండాలని జగన్ ఆదేశించారు. ఈ మేరకు రోజా జబర్ధస్త్ నుంచి వైదొలిగారు. కానీ ఇప్పుడు దసరా ఈవెంట్ అంటూ జబర్ధస్త్ కమెడియన్స్ చేసి షోలో రోజా మెరవడంతో వైసీపీ పార్టీ వర్గాలు షాక్ అయ్యాయి. రోజా బాధ్యతల గల మంత్రి పదవిలో ఉండి ఇలా మళ్లీ బుల్లితెరపై సందడి చేయడం పార్టీ ప్రతిష్టకు చెడ్డపేరు తెస్తుందని పలువురు జగన్ కు ఫిర్యాదు చేశారట.. దీనిపై జగన్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది.
రోజా నియోజకవర్గంలో కంటే హంగులు, ఆర్భాటాలు చేస్తోందని.. ప్రజాసేవ మరిచి సెలబ్రెటీల సేవలో తరిస్తూ జగన్ ను, పార్టీని పక్కనపెట్టి వ్యక్తిగత ఇమేజ్ సంపాదించుకుంటోందన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అందుకే జగన్ రోజాపై సీరియస్ గా ఉన్నారని.. ఆమె మంత్రి పదవి ఏ క్షణాన అయినా తొలగించవచ్చన్న ప్రచారం పార్టీలో సాగుతోంది.
పార్టీలో ఏకులా ఉన్న రోజాకు మంత్రి పదవి రాగానే మేకులా తయారైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆమె వ్యవహారశైలి రోజురోజుకు పార్టీలో శృతిమించిపోవడంతోనే రోజాకు చెక్ పెట్టాలని వైసీపీ అధిష్టానం జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.
Also Read:US Green Card: అమెరికాలో ఏడేళ్లుంటే గ్రీన్‌కార్డు?