https://oktelugu.com/

కేసీఆర్‌ కన్నా జగన్‌ బెటర్‌..! ఎందుకంటే.?

తెలంగాణ రాజకీయ ప్రతిపక్షాలన్నీ ఇప్పుడు జగన్‌ పక్షాన చేరుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య జలవివాదం నేపథ్యంలో ఇటీవల జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంతో తెలంగాణలోని కాంగ్రెస్‌, బీజేపీలు జగన్‌ను మెచ్చుకుంటున్నాయి. జల వివాద పరిష్కార విషయం అటుంచి జగన్‌ చేసిన పట్టుదలను చూసి కేసీఆర్‌ కంటే జగన్‌ బెటరంటూ ప్రతిపక్షాలు కితాబునివ్వడంపై ఇప్పుడు రాష్ట్రమంతటా చర్చనీయాంశంగా మారింది. Also Read: కరోనా సోకింది.. ఏపీ జనాల ‘బతుకు’ చితికింది కృష్ణ జలాల విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల […]

Written By:
  • NARESH
  • , Updated On : October 8, 2020 / 02:32 PM IST
    Follow us on

    తెలంగాణ రాజకీయ ప్రతిపక్షాలన్నీ ఇప్పుడు జగన్‌ పక్షాన చేరుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య జలవివాదం నేపథ్యంలో ఇటీవల జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంతో తెలంగాణలోని కాంగ్రెస్‌, బీజేపీలు జగన్‌ను మెచ్చుకుంటున్నాయి. జల వివాద పరిష్కార విషయం అటుంచి జగన్‌ చేసిన పట్టుదలను చూసి కేసీఆర్‌ కంటే జగన్‌ బెటరంటూ ప్రతిపక్షాలు కితాబునివ్వడంపై ఇప్పుడు రాష్ట్రమంతటా చర్చనీయాంశంగా మారింది.

    Also Read: కరోనా సోకింది.. ఏపీ జనాల ‘బతుకు’ చితికింది

    కృష్ణ జలాల విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య గత కొన్ని రోజులుగా కోల్డ్‌వార్‌ సాగుతోంది. వివాదం పెద్దగా మారకముందే కేంద్ర దృష్టికి వెళ్లడంతో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. గతంలో నిర్వహించిన అపెక్స్‌ సమావేశానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాలేదు. కానీ ఈసారి నిర్వహించిన సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ పాల్గొన్నారు. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ సమావేశంలో కేసీఆర్‌ కంటే జగన్‌ రాష్ట్ర ప్రయోజనాలను ఎక్కువగా చెప్పారని తెలంగాణకు చెందిన ప్రతిపక్షాల నాయకులు వెల్లడిస్తున్నారు.

    తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అపెక్స్‌ కౌన్సిల్‌పై స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్‌ వ్యవహార శైలితో తెలంగాణలోని ప్రాజెక్టులకు నష్టం ఖాయమన్నారు. నీటి కేటాయింపుల విషయంలో కేసీఆర్‌ తోక ముడిచారని, దీంతో రాష్ట్రానికి నష్టం చేకూరుతుందన్నారు. ప్రాజెక్టులపై డీపీఆర్లు సమర్పించేది లేదని చెప్పడం ఇందుకు నిదర్శనమన్నారు.

    Also Read: మావోయిస్టుల కట్టడికి పోలీసుల వినూత్న ప్లాన్‌

    ఇక పీసీసీ అధ్యక్షుడు భట్టి విక్రమార్క సైతం కేసీఆర్‌ తీరుపై విరుచుకుపడ్డారు. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో కేసీఆర్‌ కంటే జగన్‌ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎక్కువగా వాదించారన్నారు. కాని కేసీఆర్‌ మాత్రం ఎందుకు పోరాడలేదో రాష్ట్ర ప్రజలకు చెప్పాలన్నారు. మరోవైపు బీజేపీ జాతీయ కార్యదర్శి డీకే ఆరుణ సైతం జగన్‌ తమ ప్రజల కోసం ఎక్కువగా పోరాడుతుండగా కేసీఆర్‌ మాత్రం స్వప్రయోజనాలను చూసుకున్నారన్నారు. దీంతో రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేశారన్నారు.