Bheemla Nayak Ticket Rates: ఏపీలో టికెట్ల రేట్ల అంశం ఇప్పుడు గందరగోళంగా మారిపోయింది. పెద్ద సినిమాలన్నీ రిలీజ్‌కు రెడీ అయిపోతున్నాయి. అయితే చిరంజీవి టీమ్ చర్చలు జరిపిన తర్వాత సానుకూల నిర్ణయం వచ్చిందని ప్రకటించారు. ప్రతి సినిమాకు ఒకే రకమైన ధరలను నిర్ణయిస్తూ ప్రభుత్వం ఈ మేరకు రేట్ల లిస్టును వారికి అందజేసింది. అయితే ఇందుకు ప్రభుత్వం 13 మందితో కమిటీని ఏర్పాటు చేసింది జగన్ ప్రభుత్వం.
అయితే ఈ కమిటీ చివరిసారిగా సమవేశం అయి నివేదికలను మూడు రోజుల్లోపు జగన్ కు అందజేసే అవకాశం ఉంది. కాగా సినీ పెద్దలు ఫిబ్రవరి 20లోపు జీవలో వచ్చేలా చూడాలని కోరారు. కాగా మరో మూడు రోజుల వరకు నివేదికలు ఇస్తే.. జగన్ వాటిమీద జీవోలు జారీ చేసే సరికి ఇంకో నాలుగు రోజులు పెట్టుకున్నా.. మొత్తంగా వారం రోజులు పట్టేలా ఉంది.
కానీ ఆలోగా అంటే.. ఈ నెల 25న భీమ్లా నాయక్ వస్తోంది. ఇది చాలా పెద్ద సినిమా. పైగా పవన్ మూవీ కావడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. మరి జీవోలు రాకముందే ఈ మూవీ రిలీజ్ అవుతోంది. ఇక మరో మూడు రోజుల్లోగా టికెట్ల బుకింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. మరి అధికారికంగా జీవోలు రావట్లేదు కాబట్టి దీనికి పెంచిన రేట్ల ప్రకారం టికెట్లు ఉండే అవకాశం లేదు.
Also Read: సవాళ్లు విసిరిన వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుంటున్న జగన్.. మిగిలింది అదొక్కటే..!
తగ్గించిన రేట్ల ప్రకారమే బుకింగ్స్ స్టార్ట్ అవుతాయి. కానీ విడుదల అయిన వారం తర్వాత అయినా జీవోలు వస్తాయి. కాబట్టి అప్పుడు మళ్లీ పెంచిన రేట్ల ప్రకారం టికెట్లు అమ్ముకునే చాన్స్ ఉంటుంది. పైగా ఐదో షోకు కూడా అనుమతి వస్తుంది. కానీ రెండో వారంలోగా ఇంకిన్ని పెద్ద సినిమాలు వస్తుంటాయి. తొలి వారం కలెక్షన్స్ ఏ సినిమాకు అయినా చాలా ముఖ్యం. పైగా ఆంధ్రాలో పవన్‌కు చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది.
కాబట్టి టికెట్ల రేట్లు తక్కువగా ఉంటే అది పవన్ కలెక్షన్స్‌ను దెబ్బ తీస్తుంది. అప్పటికే సినిమా చాలామంది చూస్తారు కాబట్టి రెండో వారంలో సినిమాకు వెళ్లే వారు తగ్గిపోతారు. మొత్తానికి పవన్ సినిమా రిలీజ్ అయిన తర్వాతే జీవోలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అంతర్గతంగా వైసీపీ ప్రభుత్వ ప్లాన్ కూడా ఇదే అనే చర్చ సాగుతోంది.
Also Read: హీరో అరవింద్ స్వామి భార్య సంపాదన ఎంతో తెలుసా.. నెలకు అన్ని కోట్లా..!