షర్మిల రాక.. ముఖం చాటేస్తోన్న జగన్

జూలై 8న దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు వైఎస్ విజయమ్మ, జగన్, షర్మిల, తదితరులు కడప జిల్లాలోని ఇడుపుల పాయలో ప్రతీసారి ఆయన సమాధి వద్ద నివాళులర్పిస్తూ వస్తున్నారు. సాధారణంగా ఉదయం 8 గంటల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొని వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్మృతులను గుర్తు చేసుకుంటూ రోజంతా గడుపుతారు. అయితే ఈసారి ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇడుపులపాయ పర్యటనలో టైం చేంజ్ అయింది. ఆయన […]

Written By: NARESH, Updated On : July 6, 2021 10:04 am
Follow us on

జూలై 8న దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు వైఎస్ విజయమ్మ, జగన్, షర్మిల, తదితరులు కడప జిల్లాలోని ఇడుపుల పాయలో ప్రతీసారి ఆయన సమాధి వద్ద నివాళులర్పిస్తూ వస్తున్నారు. సాధారణంగా ఉదయం 8 గంటల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొని వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్మృతులను గుర్తు చేసుకుంటూ రోజంతా గడుపుతారు. అయితే ఈసారి ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇడుపులపాయ పర్యటనలో టైం చేంజ్ అయింది. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళి అర్పించేందుకు సాయంత్రం వెళ్లనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే అందుకు షర్మిల కారణమా..? అన్న చర్చ సాగుతోంది.

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కడప జిల్లా పర్యటనలో భాగంగా ఈనెల 7న ఇడుపులపాయకు చేరుకుంటారని, ఆ తరువాత మరుసటి రోజు ఉదయం 8 గంటలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పిస్తారని తొలుత భావించారు.అదేరోజు వైఎస్ షర్మిల బెంగుళూరు నుంచి ప్రత్యేక విమానంలో ఇడుపుల పాయకు వచ్చి నివాళులర్పించిన తరువాత తిరిగి హైదరాబాద్ వెళ్తారని అందరూ భావించారు. అయితే వైఎస్ జయంతి సందర్భంగా తెలంగాణ షర్మిల కొత్త పార్టీ ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ సమాధి వద్ద అన్నా చెల్లెళ్లు కలుస్తారని ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పర్యటనలో మార్పలు చేశారు. ఈ మేరకు కడప జిల్లా అధికారులకు ముఖ్యమంత్రి టూర్లో మార్పులు జరిగాయని సమాచారం అందినట్లు తెలుస్తోంది. వారికి అందిన సమాచారం ప్రకరాం ఈనెల 8న ఉదయం సీఎం జగన్ గన్నవరం నుండి బయలు దేరి పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నంచి రాయదుర్గంకు హెలీక్యాప్టర్లో వెళ్లనున్నారు. అక్కడ జరిగే రైతు దినోత్సవంలో పాల్గొంటారు. ఆ తరువాత సాయంత్రం వరకు పులివెందులకు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు వైఎస్ సమాధి వద్ద 45 నిమిషాల పాటు నివాళులర్పించనున్నారు.

అయితే ప్రతీ సారి ఉదయం 8 గంటల నుంచి వైఎస్ జయంతి కార్యక్రమంలో పాల్గొనే జగన్ ఈసారి సాయంత్రం 4 గంటలకు నివాళులర్పించాలనుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఉదయం షర్మిల ఇక్కడికి రానుండడంతో.. జగన్, షర్మిలలు కలిసే అవకాశం ఉంది. షర్మిల ఇప్పటికే రాయలసీమ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ వైపే మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఇద్దరు ఒకేసారి కలిస్తే రాజకీయంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నందున జగన్ పర్యటనను సాయంత్రం కు మార్చారని అంటున్నారు. అయితే ఈ విషయంపై వైసీపీ నాయకులు మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.