ఏపీలో ఆ వర్గాలకు జగన్ రూ.370 కోట్లు

చేతికి ఎముకే లేకుండా సీఎం జగన్ సంక్షేమం కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారు. అప్పులు తెచ్చి మరీ ఈ పందేరం చేస్తున్నారు. లబ్ధిదారులకు వందల కోట్లు వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. దేశంలో ఏ సీఎం చేయని విధంగా జగన్ చేస్తున్న పందేరం అందరినీ ఆకర్షిస్తోంది. ఏపీ సీఎం జగన్ మరోసారి వరాలు కురిపించారు. ‘జగనన్న తోడు’ పథకం కింద రెండో ఏడాది కూడా నిధులను విడుదల చేశారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని చిరు వ్యాపారులు,సంప్రదాయ […]

Written By: NARESH, Updated On : June 8, 2021 1:29 pm
Follow us on

చేతికి ఎముకే లేకుండా సీఎం జగన్ సంక్షేమం కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారు. అప్పులు తెచ్చి మరీ ఈ పందేరం చేస్తున్నారు. లబ్ధిదారులకు వందల కోట్లు వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. దేశంలో ఏ సీఎం చేయని విధంగా జగన్ చేస్తున్న పందేరం అందరినీ ఆకర్షిస్తోంది.

ఏపీ సీఎం జగన్ మరోసారి వరాలు కురిపించారు. ‘జగనన్న తోడు’ పథకం కింద రెండో ఏడాది కూడా నిధులను విడుదల చేశారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని చిరు వ్యాపారులు,సంప్రదాయ వృత్తి కళకారులకు రూ.370 కోట్ల ఆర్థిక సాయాన్ని విడుదల చేస్తున్నట్టు సీఎం తెలిపారు.

చిరువ్యాపారులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని.. గత్యంతరం లేక వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు తీసుకొని వారు అష్టకష్టాల పాలవుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థలను పేదవాడికి ఉపయోగపడేలా తీసుకురాకపోతే ప్రభుత్వాలు ఫెయిల్ అయినట్లేనని జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని 3.7 లక్షల మంది లబ్ధిదారులకు స్త్రీనిధి, ఆప్కాబ్, ఇతర బ్యాంకుల నుంచి రూ.10వేల వరకు వడ్డీలేని రుణం లేకపోతే ఆందోళన అవసరం లేదని.. గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుందన్నారు. సాయం కోసం ఫిర్యాదుల కోసం 1902 నంబర్ కు కాల్ చేయవచ్చని సీఎంజగన్ సూచించారు. జగన్ చేస్తున్న సంక్షేమంపై లబ్ధిదారులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కరువులో తమను ఆదుకుంటున్నారని అంటున్నారు.