AP Govt Announced New Jobs: ఆంధ్రప్రదేశ్ లో కొలువుల జాతర ప్రారంభం కానుంది. ఇప్పటికే తెలంగాణలో దాదాపు 80 వేల కొలువుల భర్తీకి సర్కారు అంగీకారం తెలిపిన నేపథ్యంలో ఏపీలో కూడా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో ఉద్యోగాల కోసం రెండు రాష్ట్రాలు నిరుద్యోగులకు తీపి కబురు అందించాయి. ఇక ఉద్యోగాలు సాధించేందుకు నిరుద్యోగ యువత కుస్తీ పడుతోంది. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని కలలు కంటోంది. దీని కోసం కోచింగులు తీసుకునేందుకు తరలి వెళ్తున్నారు.

ఈ మేరకు గ్రూప్ -1, గ్రూప్ -2 పోస్టులతో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ -1 పోస్టులు 110, గ్రూప్ -2 పోస్టులు 182 ఖాళీలతో నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో నిరుద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఇంత చిన్న సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఎందుకు వేసినట్లు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సీఎం జగన్ స్పందించారు. ఈ నోటిఫికేషన్ మార్చి నాటికేనని ఏప్రిల్ మొదటి వారంలో మరో నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెబుతున్నారు.
Also Read: Taxes in AP: ఏపీ ప్రజల ‘పన్ను’ పీకేందుకు రెడీ అవుతున్న జగన్?
ఈ సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఈ ఉద్యోగాలు భర్తీ చేసి మరో సంవత్సరంలో మరో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి భారీ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెబుతుండటంతో నిరుద్యోగులు శాంతించారు. ఇప్పటికే తమ వయసు అయిపోతోందని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం త్వరగా నోటిఫికేషన్లు వేస్తే తమకు లాభం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన చేయడంతో ఆయనను అనుసరిస్తూ జగన్ కూడా కొలువుల జాతరకు వెళ్లడం చర్చనీయాంశం అవుతోంది. కేసీఆర్ ను ఫాలో అవుతున్నారనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాల జాతర ప్రారంభం కావడంతో నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఉద్యోగాల కోసం వేచి చూసిన యువత ఇక వాటిని సాధించేందుకు కసరత్తు ప్రారంభించింది. కోచింగులకు వెళ్తూ పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలనే కోరికతో అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇందుకోసం అన్ని మార్గాలు అన్వేషిస్తున్నారు. అన్నిపుస్తకాలు తిరగేస్తున్నారు. ఉద్యోగం పురుష లక్షణం అన్నారు కాబట్టే జాబ్ కోసం తాపత్రయపడుతున్నారు.
Also Read: Shankar Naik: మందేసి చిందేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. వీడియో వైరల్
[…] Jasmine Health Benefits: మల్లెపూలను ఇష్టపడని ఆడవాళ్లు ఉండరు. సృష్టిలో దొరికే అందమైన పూలలో మల్లెపూలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. మల్లె పూలు ఇచ్చే పరిమళం ఎంతో బాగుంటుంది. వేసవి సీజన్‌లో మల్లెపూలు విరివిగా దొరుకుతుంటాయి. అయితే మల్లెపూలు సువాసనకే కాదు ఆరోగ్యానికి దివ్య ఔషధంలా కూడా పనిచేస్తాయని మనలో చాలా తక్కువ మందికి తెలుసు. […]
[…] […]
[…] Pawan Kalyan- BJP: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. పొత్తులపై ఎవరి ఎత్తులు వారికున్నాయి. దీంతో ఇదివరకే జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నామని ప్రకటించిన నేపథ్యంలో అటు టీడీపీ, ఇటు వైసీపీ బీజేపీ నిర్ణయంపై ఉత్కంఠగా చూస్తున్నాయి. బీజేపీ రోడ్ మ్యాప్ ఎలా ఉంటుందో అనే దానిపై తర్జనభర్జనలు పడుతున్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. బీజేపీ ఆఫర్ పై అన్నిటి భవితవ్యం ఆదారపడి ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో భవిష్యత్ వ్యూహాల కోసం సిద్ధమవుతున్నాయి. […]
[…] […]
[…] Also Read: కేసీఆర్ ను ఫాలో అవుతున్న జగన్.. ఏపీలొ… […]